శివుడికి అత్యంత ప్రీతికరమైన శ్రావణ మాసంలో కొన్ని నియమాలు పాటించాలి అని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి సోమవారం శివుని పూజించడం, అభిషేకం చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు.
శ్రావణ మాసం సంపూర్ణంగా భక్తి శ్రద్ధలతో గడపాలి. మహిళలు ప్రత్యేకంగా ఉపవాసాలు చేస్తూ శివాలయాలను సందర్శిస్తే అదృష్టం వెల్లివిరుస్తుందట. ఈ మాసంలో ఉల్లిపాయలు, మాంసాహారం వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల దరిద్రదేవత ఆవహించే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు.
శ్రావణ సోమవారాలు ఎందుకు ముఖ్యమంటే?
ఈ మాసంలోని ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయడం ఎంతో ఫలప్రదం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, గంగాజలం, బిల్వపత్రాలతో రుద్రాభిషేకం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ప్రదోషకాలంలో శివునికి మహా మృత్యుంజయ మంత్ర జపం కూడా చేయాలి.
శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి
శ్రావణ మాస శుక్రవారాల్లో లక్ష్మీదేవికి పూజలు చేయడం ద్వారా ధన, ఐశ్వర్యం వస్తుందని విశ్వాసం. వివాహితులు భర్త ఆయుష్షు కోసం, అవివాహితులు మంచి వరుడి కోసం వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తారు. ఉపవాసం, సాత్విక ఆహారం పాటిస్తూ పూజలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
ఈ తప్పులు అసలు చేయకూడదు
ఈ మాసంలో మాంసాహారం, ఉల్లిపాయలు, మద్యం, ధూమపానం వంటి అలవాట్లను వదలాలి. సూర్యోదయానికంటే ముందే లేచి పూజలు ప్రారంభించాలి. ఇవన్నీ శుభఫలితాలకే దోహదపడతాయి. అంతేగాక, లోపలి మనస్సు కూడా శుభ్రంగా ఉండాలి.. అసూయ, కోపం లాంటి భావనలు వదిలి, భగవంతుని స్మరణలో ఉండాలని పండితులు సూచిస్తున్నారు.