పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రతి సంవత్సరం కన్నుల పండువగా జరిగే ఈ మహోత్సవం కోసం ఈసారి దాదాపు 12 లక్షల మంది భక్తులు పూరీకి తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ రథయాత్రలో, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ తండ్రులుగా రథాలపై భక్తులకు దర్శనమిస్తారు. రథయాత్ర రూట్‌తో పాటు మొత్తం 35 కిలోమీటర్ల మేర భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.
ଜୟ ଶ୍ରୀଜଗନ୍ନାଥ pic.twitter.com/9MWXYqqo8E
— Shree Jagannatha Temple Office, Puri (@SJTA_Puri) June 27, 2025
భద్రతా దృష్ట్యా:
275 పైగా AI ఆధారిత CCTV కెమెరాలు
డ్రోన్లు, బాంబ్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు
10,000 మంది భద్రతా సిబ్బంది, వీరిలో 8 కంపెనీల కేంద్ర బలగాలు
ଜୟ ଜଗନ୍ନାଥ#RathaJatra2025 #RathaYatra2025 #ShreeJagannathaDhaam #SJTA pic.twitter.com/lIlRPB7BrD
— Shree Jagannatha Temple Office, Puri (@SJTA_Puri) June 27, 2025
వీటితో పాటు డ్రోన్ల సహాయంతో రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఒడిశా డీజీపీ వైబీ ఖురానియా తెలిపారు.
భక్తులకు సురక్షితమైన, ఆధ్యాత్మిక అనుభూతితో కూడిన అనుభవం కల్పించేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సిద్ధమైంది.