Devi Navaratri 2025: నేటి నుంచే దేవీ నవరాత్రులు ప్రారంభం.. ఇలా పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం

దేవీ నవరాత్రులు (Devi Navaratri 2025) నేటి నుంచే ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని ఆరాధిస్తారు. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాస శుక్లపక్షం పాడ్యమి నుండి శరన్నవరాత్రులు ప్రారంభమై, దశమి వరకు కొనసాగుతాయి. ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు.

మొదటి రోజు పూజ విధానం
నవరాత్రుల తొలి రోజున దుర్గాదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. అమ్మవారి పటాన్ని లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించాలి. ముఖ్యంగా ఎరుపు పూలు, గులాబీలు వాడితే శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి, అగరుబత్తులు వెలిగించాలి.

ఈ రోజున అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. గులాబీ రంగు చీరతో అలంకరించడం శ్రేయస్కరం. పూజ అనంతరం లలితా సహస్రనామం పారాయణం చేయాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పాయసం (క్షీరాన్నం) తయారు చేసి సమర్పించాలి. పంచదారకు బదులుగా బెల్లంతో చేస్తే మరింత శుభం కలుగుతుందని అంటారు. ఆపై కుంకుమతో పూజ చేసి హారతి ఇవ్వాలి. ఇలా పూజిస్తే ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయని విశ్వాసం.

తొమ్మిది రోజుల అలంకారాలు

బాలాత్రిపుర సుందరీ దేవి

శ్రీ గాయత్రీ దేవి

శ్రీ అన్నపూర్ణా దేవి

శ్రీ కాత్యాయనీ దేవి

శ్రీ మహాలక్ష్మి దేవి

శ్రీ లలితా దేవి

శ్రీ చండీదేవి

శ్రీ సరస్వతి దేవి

శ్రీ దుర్గాదేవి

మహిషాసుర మర్ధిని

శ్రీ రాజరాజేశ్వరి దేవి

Leave a Reply