హిందూ సంప్రదాయంలో దేవీ నవరాత్రులు ఎంతో ప్రత్యేకమైనవి. ప్రతీ ఏడాది భక్తితో, స్త్రీ శక్తిని ప్రతీకగా పూజిస్తూ దుర్గాదేవిని కొలుస్తారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శుక్ల పక్షం పాడ్యమి నుండి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతున్నాయి.
మరి ఈ తొమ్మిది రోజులలో ఏ నియమాలు పాటిస్తే అన్ని విధాలుగా శుభాలు, ఐశ్వర్యం లభిస్తాయి చూద్దాం.
1. లలితా సహస్ర నామం పఠించడం
నవరాత్రుల సమయంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం లలితా సహస్ర నామం తప్పక పఠించాలి. పఠనంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో శుభాకాంక్షలు మరియు శక్తివంతమైన positive energy ఏర్పడుతుంది. పండితులు చెబుతున్నట్లు, వీటిని నిత్యం పాటించడం అన్ని విధాల శుభకరంగా ఉంటుంది.
2. దుర్గా సప్తశతి పారాయణం
నవరాత్రులలో దుర్గా సప్తశతి చదవడం అత్యంత ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు. ఈ పారాయణం ద్వారా దుష్ట శక్తుల నుండి రక్షణ కలుగుతుంది. భయాలు, అడ్డంకులు తొలగిపోతాయి. పండితుల ప్రకారం, పఠనంతో ప్రతీ పని విజయవంతంగా సాగుతుందని నమ్మకం ఉంది.
3. అమ్మవారికి నైవేద్యం
ప్రతిరోజూ అమ్మవారికి వేర్వేరు నైవేద్యాలు సమర్పించాలి. దేవీ రూపాన్ని బట్టి, ఆ ప్రత్యేక పూజకు అనుగుణంగా అమ్మవారికి ఇష్టమైన ఆహారాలు, పండ్లు, మిఠాయిలు సమర్పించడం వల్ల అమ్మవారి ఆశీస్సులు పొందవచ్చు. ఈ ఆచరణ ఇంట్లో సంతోషం, ఐశ్వర్యాన్ని పెంచుతుంది.
4. దీపారాధన
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన తప్పనిసరి. ఇంటి ద్వారం దగ్గర, పూజా స్థలంలో దీపం వెలిగించడం వల్ల negative energy తొలగిపోతుంది. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి, సుఖసంతోషాలు నెలకొంటాయి.
5. పసుపు, కుంకుమ, పూలు సమర్పించడం
నవరాత్రుల సమయంలో మహిళలను గౌరవించడం ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు. కొత్త దుస్తులు ధరించడం, పసుపు, కుంకుమ, పూలు సమర్పించడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. ఈ ఆచరణ ద్వారా అమ్మవారిని గౌరవించడం నిశ్చితమవుతుంది.
నవరాత్రుల ఆచరణల ఫలితం
తొమ్మిది రోజుల పాటు ఈ నియమాలు పాటించడం వల్ల జ్ఞానం, సంపద, ఐశ్వర్యం, సంతానం లభిస్తాయి. పాపాలు తొలగిపోని సమస్యలు, ఆందోళనలు అన్ని తొలగిపోతాయి. భక్తితో పూజలు నిర్వహించడం ద్వారా ప్రతీ పనిలో విజయం, కుటుంబంలో సంతోషం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.