Astadasha Shakti Peethas: అష్టాదశ శక్తి పీఠాలు.. హిందూ పురాణాలలోని 18 పవిత్ర దేవాలయాలు ఇవే..!

హిందూ పురాణాల ప్రకారం, ఆదిపరాశక్తే చరాచర జగతికి మూలం. దక్షుడు చేస్తున్న యాగానికి ఆహ్వానం లేకపోయినా, సతీదేవి (ఆదిపరాశక్తి) అక్కడికి వెళ్ళింది. అక్కడ పరమేశ్వరుడిని దక్షుడు అవమానించడంతో, ఆమె అగ్నిప్రవేశం చేసింది.

అగ్నిలో కాలుతున్న సతీదేవి శరీరాన్ని పరమేశ్వరుడు భుజాన వేసుకుని ఉగ్రతాండవం చేయగా, అన్ని లోకాలు వణికిపోయాయి. లోకాలను కాపాడేందుకు విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 భాగాలుగా చేశాడు. ఆ 18 భాగాలు పడ్డ ప్రదేశాలే అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి.

18 మహా శక్తి పీఠాలు ఇవే:

శాంకరీ దేవి – త్రింకొమలీ, శ్రీలంక

కామాక్షీ దేవి – కాంచీపురం, తమిళనాడు

శృంఖలాదేవి – పాండువా, హూగ్లీ, పశ్చిమ బెంగాల్

చాముండేశ్వరి దేవి – మైసూరు, కర్ణాటక

జోగులాంబ – ఆలంపూర్, తెలంగాణ

భ్రమరాంబికా దేవి – శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్

మహాలక్ష్మి దేవి – కొల్హాపూర్, మహారాష్ట్ర

ఏకవీరా దేవి/రేణుకా మాత – నాందేడ్, మహారాష్ట్ర

మహాకాళీ దేవి – ఉజ్జయిని, మధ్యప్రదేశ్

పురుహూతికా దేవి – పిఠాపురం, ఆంధ్రప్రదేశ్

బిరజా దేవి/గిరిజా దేవి – జాజ్‌పూర్, ఒడిశా

మాణిక్యాంబా దేవి – ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్

కామాఖ్యా దేవి – గువాహటి, అసోం

మాధవేశ్వరి – ప్రయాగ్, ఉత్తరప్రదేశ్

జ్వాలాముఖి దేవి – కాంగ్రా, హిమాచల్‌ప్రదేశ్

సర్వమంగళా దేవి/మంగళగౌరి దేవి – గయా, బిహార్

విశాలాక్షి దేవి – వారణాసి, ఉత్తరప్రదేశ్

సరస్వతీ దేవి – జమ్మూకశ్మీర్

Leave a Reply