TCS salary hike : TCSలో 12 వేల మందికి షాక్.. జీతాలు మాత్రం భారీగా పెంచిన కంపెనీ!

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) తన ఉద్యోగుల్లో చాలా మందికి వేతనాల పెంపును ప్రకటించింది. సాధారణంగా 4.5% నుంచి 7% వరకు జీతాలను పెంచుతుండగా, అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి మాత్రం 10% పైగా హైక్ ఇచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ వేతన సవరణలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

కానీ మరోవైపు టీసీఎస్ ఉద్యోగుల తొలగింపులతోనూ వార్తల్లో నిలిచింది. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి కంపెనీలు వేలాది మందిని లేఆఫ్స్ చేశాయి. టీసీఎస్ ఒంటరిగానే సుమారు 12,261 మందిని అంటే ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో 2% మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది.

ఈ తొలగింపులకు ప్రధాన కారణం ఉద్యోగుల్లో కొత్త నైపుణ్యాల లోపం అని కంపెనీ తెలిపింది. సాంకేతిక పరిణామాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ముఖ్యంగా తక్కువ పనితీరు చూపే ఉద్యోగులు, అలాగే మధ్యస్థాయి మరియు సీనియర్ ఉద్యోగులపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్లు సమాచారం.

అయితే ఉద్యోగులలో 80% మందికి జీతాల పెంపు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగులకు వర్తించే ఈ ఇంక్రిమెంట్లు ఇప్పటికే అమలులోకి వస్తున్నాయి. C3A మరియు సమానమైన గ్రేడ్‌లలో ఉన్న అసోసియేట్స్‌కు వేతన సవరణలు ఇచ్చినట్లు కంపెనీ ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది.

ఇలా ఒక వైపు ఉద్యోగులను తొలగిస్తూ.. మరోవైపు భారీగా జీతాలు పెంచడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

Leave a Reply