మరో వివాదంలో నటి శిల్పా శెట్టి దంపతులు.. రూ.60 కోట్లు మోసం చేశారని కేసు నమోదు

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty), ఆమె భర్త రాజ్ కుంద్రా (Raj Kundra) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ముంబైకి చెందిన బడా వ్యాపారవేత్త దీపక్ కొఠారి (Deepak Kothari) ఫిర్యాదు మేరకు, వీరి పై రూ.60 కోట్ల మోసం ఆరోపణలతో జుహు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం, 2015-2023 మధ్య కాలంలో ‘బెస్ట్ డీల్ టీవీ’ (Best Deal TV) అనే షాపింగ్ ప్లాట్‌ఫామ్‌కు పెట్టుబడిగా రూ.60.48 కోట్లు ఇచ్చానని, 2016లో శిల్పా శెట్టి స్వయంగా హామీ ఇచ్చిందని దీపక్ కొఠారి తెలిపారు. ఆ సమయంలో శిల్పా, రాజ్ కుంద్రాలు కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే, 87% వాటా కలిగిన వీరిలో శిల్పా శెట్టి కొంత కాలం తర్వాత డైరెక్టర్ పదవికి రాజీనామా చేయగా, కంపెనీ దివాళా తీసిందని ఆరోపణ.

అదేవిధంగా, రాజీనామా విషయాన్ని రహస్యంగా ఉంచి, పెట్టుబడి డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.10 కోట్లకు పైగా దాటినందున.. దీనిని మోసంగా భావించి, ఈ కేసు దర్యాప్తు ఆర్థిక నేరాల విభాగం (EOW) కి అప్పగించబడింది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, గతంలోనూ శిల్పా శెట్టి దంపతులపై మనీలాండరింగ్ ఆరోపణలతో ముంబైలో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.

Leave a Reply