ప్రపంచంలోనే అత్యధికంగా వాడే వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను కొనేందుకు AI స్టార్టప్ పర్ప్లెక్సిటీ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా గూగుల్‌కు మొత్తం 34.5 బిలియన్ డాలర్ల ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
పర్ప్లెక్సిటీ సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న స్టార్టప్. బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం, ఈ ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు పర్ప్లెక్సిటీ బయటి పెట్టుబడిదారుల సహాయం తీసుకోనుంది. కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ దిమిత్రి షెవెలెంకో ప్రకారం, పెట్టుబడిదారులు ఫైనాన్స్ కూడా అందించేందుకు అంగీకరించారట.
పర్ప్లెక్సిటీ ఈ ఏడాది జూలైలో 100 మిలియన్ డాలర్ల ఫండింగ్ సమీకరించింది. ఆ ఫండింగ్ కౌండ్ ప్రకారం కంపెనీ విలువ దాదాపు 1.57 లక్షల కోట్ల రూపాయలు. అయితే, గూగుల్ క్రోమ్ కోసం కంపెనీ చేసిన ఆఫర్ తన విలువ కంటే చాలా ఎక్కువ.
పర్ప్లెక్సిటీ క్రోమ్ కోర్ ఇంజిన్ అయిన క్రోమియంను ఓపెన్ సోర్స్‌గా కొనసాగిస్తామని కూడా తెలిపింది. ఏటా దాదాపు 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం సక్సెస్ అయితే, పర్ప్లెక్సిటీని డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా కూడా మార్చవచ్చని చెప్పారు. గూగుల్ క్రోమ్‌ను కొనసాగించేందుకు ఆ కంపెనీ ప్రతిజ్ఞ చూపించింది.
ఇక గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు యత్నిస్తున్నట్లు, యాపిల్, శాంసంగ్ వంటి సంస్థలకు ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ మరియు కొన్ని రాష్ట్రప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించి, గూగుల్ పాలసీలు చట్టవిరుద్ధమని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, గూగుల్ క్రోమ్ విక్రయించాల్సిన అవసరం, సెర్చ్ డేటాను పోటీదారులకు లైసెన్స్ ఇవ్వాల్సిన అవసరం, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యేక ప్రమోషన్ ఆపాల్సిన ఆదేశాలు ఇచ్చారు.
పర్ప్లెక్సిటీ AI ఆధారిత సెర్చ్ ఇంజిన్. ఇది చాట్‌జీపీటీ (ChatGPT) లాంటి యాప్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం దీనికి దాదాపు 10 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 2026 నాటికి వందల కోట్ల యూజర్లకు చేరుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.
పర్ప్లెక్సిటీ మన ఇండియాకు చెందిన కంపెనీ. దీని కో-ఫౌండర్ చెన్నైకి చెందిన అరవింద్ శ్రీనివాస్ (31) కాగా, సీఈవోగా కూడా కొనసాగుతున్నారు.