OnePlus 13s: వన్‌ప్లస్ 13s ఫోన్ లాంచ్.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

వన్‌ప్లస్ 13s వచ్చేసింది! ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇలా పర్‌ఫార్మెన్స్, కెమెరా, డిజైన్ అన్నీ ఉన్న ఫోన్ మళ్లీ త్వరగా రాదనిపిస్తుంది.

వన్‌ప్లస్ అభిమానులు ఎంతకాలంగా ఎదురుచూస్తున్నారో ఈ OnePlus 13s ఫోన్ భారత మార్కెట్లో జూన్ 12 నుంచి సేల్‌కు సిద్ధంగా ఉంది. రెండు వేరియంట్లలో ఇది అందుబాటులోకి రానుంది – 12GB+256GB, 12GB+512GB. అమెజాన్, వన్‌ప్లస్ ఈ-స్టోర్, ఇతర రిటైల్ ఔట్‌లెట్లలో లభ్యం కానుంది.

ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉపయోగించారు. గేమింగ్‌, మల్టీటాస్కింగ్‌, హెవీ యూజ్‌కు ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. 6.32 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. HDR10+, డాల్బీ విజన్‌, HDR వివిడ్ సపోర్ట్‌తో వీడియోలు చూస్తే థియేటర్ అనుభూతినిస్తుంది.

ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా (Sony LYT-700), 50MP టెలిఫోటో కెమెరా (2X జూమ్), 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, పోర్ట్రెయిట్లు అంతే ఖచ్చితంగా వస్తాయి. 5,850mAh బ్యాటరీ 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. Android 15 ఆధారిత OxygenOS 15తో వస్తుంది.

ఫోన్‌లో Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, డ్యూయల్-సిమ్, USB టైప్-C, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, ఐఆర్ రిమోట్, గైరోస్కోప్, ఈ-కంపాస్ వంటి టాప్ క్లాస్ ఫీచర్లు ఉన్నాయి.

ధరల విషయానికి వస్తే, 12GB + 256GB వేరియంట్ రూ. 54,999కు, 12GB + 512GB వేరియంట్ రూ. 59,999కు లభ్యం కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే బ్యాంక్ డిస్కౌంట్ రూపంలో రూ. 5వేల వరకు తగ్గింపు కూడా పొందవచ్చు.

ఒకవేళ మీరు ఫోన్ మార్చాలని చూస్తున్నట్లయితే OnePlus 13s తప్పకుండా పరిశీలించవలసిన ఆప్షన్.

Leave a Reply