జియో హాట్‌స్టార్ బంపర్ ఆఫర్ 2025: సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీ సినిమాలు, సిరీస్‌లు!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జియో హాట్‌స్టార్ (JioHotstar) ఇండిపెండెన్స్ డే సందర్భంగా సినీ ప్రియులకు ప్రత్యేక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ రోజు, జియో హాట్‌స్టార్‌లోని అన్ని కంటెంట్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం లభిస్తుంది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లేకుండా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఆఫర్‌ను “ఆపరేషన్ తిరంగా” గా పేరు పెట్టారు. అయితే, ఈ ఆఫర్ కేవలం స్వాతంత్ర్య దినోత్సవం ఒక్కరోజుకు మాత్రమే అమలులో ఉంటుంది.

లాగిన్ అయితే చాలు

ఈ రోజు, మీరు ప్రీమియం సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్ మరియు ఇతర అన్ని కంటెంట్‌లను ఉచితంగా చూడవచ్చు. ప్రత్యేకంగా ఎలాంటి రీఛార్జ్ అవసరం లేదు; జియో హాట్‌స్టార్ యాప్‌లో లాగిన్ అయితే సరిపోతుంది. ఈ ఆఫర్ కేవలం జియో నెట్వర్క్ యూజర్లకు మాత్రమే కాక, జియో హాట్‌స్టార్ యాప్ ఉన్న ఇతర యూజర్లు కూడా ఉపయోగించవచ్చు.

భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, దేశభక్తిని చాటేలా “తిరంగ ఏక్, కహానియా అపెక్” పేరుతో కొన్ని ప్రత్యేక కంటెంట్‌లు అందించడానికి ఈ ఆఫర్ ప్రకటించబడింది.

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ (Independence Day Offer తర్వాత):

రూ. 349 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, 90 రోజుల డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్.

రూ. 949 ప్లాన్: 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, 3 నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్.

రూ. 3,699 ప్లాన్: 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2.5GB డేటా, ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్.

ఈ ప్రత్యేక ఆఫర్‌తో, ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున సినీ ప్రియులు ఫ్రీలో తమ ఇష్టమైన కంటెంట్‌ని ఆస్వాదించవచ్చు.

Leave a Reply