ITR : ఐటీఆర్ ఫైల్ చేయకపోతే భారీ జరిమానా.. కొన్ని రోజులు మాత్రమే సమయం..!

ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైల్ చేయాలి. ఫైల్ చేయకపోతే సెక్షన్ 234F కింద జరిమానా తప్పదు. ఈ ఏడాది ఐటీఆర్ ఫైల్ చేయడానికి సెప్టెంబర్ 15 చివరి తేదీ.

ఈ తేదీ దాటితే, ఆలస్యంగా అయినా డిసెంబర్ 31 వరకు ఫైల్ చేయవచ్చు. కానీ ఆలస్యంగా ఫైల్ చేస్తే జరిమానా విధిస్తారు.

రూ.5 లక్షలకుపైగా ఆదాయం ఉంటే జరిమానా ₹5,000

రూ.5 లక్షలలోపు ఆదాయం ఉంటే జరిమానా ₹1,000

గడువు తేదీలోగా ఐటీఆర్ ఫైల్ చేస్తేనే రిఫండ్ త్వరగా వస్తుంది. ఆలస్యంగా ఫైల్ చేస్తే రిఫండ్ కూడా ఆలస్యమవుతుంది.

నిపుణుల ప్రకారం, ఎక్కువ పన్ను చెల్లించిన వారికి కంటే తక్కువ పన్ను చెల్లించిన వారికి రిఫండ్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సమయానికి ఫైల్ చేయకపోతే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావచ్చు. నోటీసు వస్తే డాక్యుమెంట్లు సమర్పించాల్సి వస్తుంది. ఇది మీ లోన్, క్రెడిట్ కార్డ్ అప్రూవల్‌లపై కూడా ప్రభావం చూపిస్తుంది.

ఐటీఆర్ ఫైల్ చేసే విధానం:

www.incometax.gov.in ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.

పాన్, ఆధార్ వివరాలు నమోదు చేయాలి.

మీ ఆదాయానికి సరిపోయే ఫారమ్ ఎంచుకోవాలి.

జీతం, వడ్డీ, ఇతర ఆదాయం, మినహాయింపులు, చెల్లించిన పన్ను వివరాలు నమోదు చేయాలి.

అన్ని వివరాలు చెక్ చేసిన తర్వాత ఐటీఆర్-Vని డౌన్‌లోడ్ చేసి ఈ-వెరిఫై చేయాలి.

ఇలా ప్రాసెస్ పూర్తయితే, మీరు ఐటీఆర్ ఫైల్ చేసినట్లే. కొన్ని రోజుల్లో రిఫండ్ మీ అకౌంట్‌లో జమ అవుతుంది.

Leave a Reply