ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ (ICICI) సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ పెంచే నిర్ణయంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొని వెనక్కి తగ్గింది. ఇటీవల మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో నెలవారీ రూ.15,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.7,500, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలని కొత్త నిబంధనలు ప్రకటించింది.
ICICI Bank revises minimum monthly average balance for Savings accounts for metro and urban locations to ₹15,000, semi-urban to ₹7,500 and rural to ₹2,500#ICICIBank #SavingsAccounts pic.twitter.com/nu0Nqr9Bwf
— CNBC-TV18 (@CNBCTV18Live) August 13, 2025
కానీ, ఈ నిర్ణయానికి ముందుగా ఆగస్టు 1 తర్వాత కొత్త ఖాతాదారుల కోసం మినిమమ్ బ్యాలెన్స్‌ను భారీగా పెంచింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.10,000 నుంచి రూ.50,000కి, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.5,000 నుంచి రూ.25,000కి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 నుంచి రూ.10,000కి పెంచింది.
ఈ పెంపుపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సాధారణ ప్రజలకు ఇంత భారీ బ్యాలెన్స్ భారమని ప్రశ్నించారు. ఈ ఒత్తిడిలో ఐసీఐసీఐ తన నిర్ణయాన్ని సవరించింది.
ICICI Bank has reversed its stance on minimum account balances. New account minimum balance rules are outlined below.
The collective voice of millions on Twitter has been heard and acted upon!
Let's continue to raise our voices where there is injustice for the masses. pic.twitter.com/rRMyp16AEO
— CA Chirag Chauhan (@CAChirag) August 13, 2025
తాజా ప్రకటన ప్రకారం, ఇంతకు ముందు ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలే కొనసాగుతాయి. కొత్తగా పెంచిన భారీ మొత్తాలను రద్దు చేసి, పాత రూల్స్ ప్రకారం సేవింగ్స్ అకౌంట్లను కొనసాగిస్తామని బ్యాంక్ స్పష్టం చేసింది.