హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు రూ.10,000గా ఉన్న మినిమం బ్యాలెన్స్‌ను ఏకంగా రూ.25,000కు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధన 2025 ఆగస్టు 1 తర్వాత కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసేవారికి మాత్రమే వర్తిస్తుంది. పాత అకౌంట్లకు పాత నిబంధనలే అమల్లో ఉంటాయి.
సెమీ-అర్బన్ ప్రాంతాల్లో మినిమం బ్యాలెన్స్ రూ.5,000 నుంచి రూ.25,000కు పెంచగా, రూరల్ ప్రాంతాల్లో రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచింది. మినిమం బ్యాలెన్స్ కంటే తక్కువ ఉంటే జరిమానా విధించనుంది. ఈ జరిమానా లోటు మొత్తంలో 6% లేదా గరిష్టంగా రూ.600 వరకు ఉండవచ్చు.
అదే సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని రకాల రుణాలపై MCLR (ఫండ్స్ ఆధారిత రుణ రేటు)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గింపు ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు బ్యాంక్ MCLR రేట్లు 8.55% నుంచి 8.75% మధ్య ఉన్నాయి.
its786126295 HDFC Bank's minimum average balance for regular savings accounts in urban/metro areas remains Rs 10,000 (or FD of Rs 1 lakh), per official August 2025 document. No changes, unlike ICICI's reduction to Rs 15,000.
— Grok (@grok) August 13, 2025
ICICI బ్యాంక్ నిర్ణయాల్లో మార్పులు
ఇక ఐసీఐసీఐ బ్యాంక్ కూడా కనీస బ్యాలెన్స్ నిబంధనల్లో మార్పులు చేసింది. మొదట మెట్రో మరియు పట్టణ ప్రాంతాల్లో కొత్త ఖాతాదారులకు MAB (Monthly Average Balance)ను రూ.10,000 నుంచి రూ.50,000కు పెంచింది. సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ.5,000 నుంచి రూ.25,000కు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,000 నుంచి రూ.10,000కు పెంచింది.
అయితే ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి, మెట్రో మరియు పట్టణ ప్రాంతాల్లో MABను రూ.15,000కు, సెమీ-అర్బన్‌లో రూ.7,500కు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500కు సవరించింది. ఈ నిబంధనలు కూడా ఆగస్టు 1 తర్వాత కొత్త ఖాతాలకు మాత్రమే వర్తిస్తాయి.
ATM లావాదేవీలు
ICICI బ్యాంక్ ATMలలో నెలకు మొదటి ఐదు లావాదేవీలు ఉచితం. ఆ తర్వాత ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ.23 వసూలు చేస్తారు. నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలు ఉచితం.
ఆరు మెట్రో నగరాలు (ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్)లో నెలకు మొదటి మూడు లావాదేవీలు ఉచితం. ఆ తర్వాత ఆర్థిక లావాదేవీకి రూ.23, నాన్-ఫైనాన్షియల్ లావాదేవీకి రూ.8.5 వసూలు చేస్తారు. ఇతర ప్రాంతాల్లో మొదటి ఐదు లావాదేవీలు ఉచితం, ఆ తర్వాత పై ఛార్జీలు వర్తిస్తాయి.