నిరుద్యోగులకు శుభవార్త.. రాబోయే 5 ఏళ్లలో 2.5 లక్షల బ్యాంక్ ఉద్యోగాలు!

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల సంఖ్య రాబోయే సంవత్సరాల్లో గణనీయంగా పెరుగనుంది. తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం 2030 నాటికి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు 10% పెరుగుతాయని, అంటే దాదాపు 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చే ఐదేళ్లలో సృష్టించబడతాయని అంచనా.

ప్రస్తుతం ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం సంపాదించడం కష్టతరమైంది. ఒక్కో ఉద్యోగానికి వేలల్లో పోటీ ఉంది. ఐటీ రంగంలో భారీగా లేఆఫ్స్ జరుగుతున్నాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం వల్ల కొన్నేళ్లలో ఉద్యోగాలు తగ్గుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ (BFSI) రంగం గుడ్ న్యూస్ అందించింది.

2025-26లో బ్యాంకింగ్ నియామకాలు 8.7% పెరుగుతాయని అంచనా.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 27% రిక్రూట్‌మెంట్ వృద్ధి నమోదైంది.
టైర్ 2, టైర్ 3 నగరాల్లో బ్యాంకింగ్ జాబ్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.

ఎక్కువగా డిమాండ్ ఉన్న రోల్స్:

సంపద నిర్వహణ (Wealth Management)

బీమా సంస్థలు

ఆర్థిక ప్రణాళికదారులు (Financial Planners)

పెట్టుబడి సలహాదారులు (Investment Advisors)

డిజిటల్ అండర్‌రైటర్లు

క్లెయిమ్ ఆటోమేషన్

బ్యాంకింగ్ సేల్స్ (Credit & Health Cards)

డిజిటల్ ప్రొడక్ట్ మేనేజర్లు

క్రెడిట్ రిస్క్ నిపుణులు

నియామకాలు పెరుగుతున్న నగరాలు:

కోయంబత్తూర్, ఇండోర్, గౌహతి, నాగ్‌పూర్‌లో 15-18% నియామకాలు పెరిగాయి.
సూరత్, జైపూర్, లక్నో, భువనేశ్వర్‌లలో 11-13% వృద్ధి కనిపించింది.

మొత్తంగా చూసుకుంటే, రాబోయే ఐదేళ్లలో బ్యాంకింగ్ రంగం ఉద్యోగార్థులకు ఆశాకిరణంగా మారనుంది.

Leave a Reply