బుల్లితెర నటి ఆశు రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ పెద్ద దుమారం రేపుతోంది. ఆశు తన ఛాతిపై పవన్ కళ్యాణ్ పేరు టాటూ వేయించుకొని, ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో పాటు “మీరు ఉన్న ఈ భూమిపైనే నేను కూడా పుట్టినందుకు గర్వంగా ఉంది. ప్రజల దేవుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ క్యాప్షన్ జత చేసింది.
View this post on Instagram
ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు ఆమె అభిమానాన్ని పొగడ్తలతో ప్రశంసిస్తే, మరికొందరు టాటూ వేసుకున్న ప్రదేశం గురించి విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదైమైనా, ఆశు రెడ్డి పోస్ట్ మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.