బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల త్వరలో తల్లి కాబోతోంది. ఈ సంతోషకరమైన విషయాన్ని సోనియా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. బేబీ స్కాన్ రిపోర్ట్స్ పట్టుకుని భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ, “మా గుండెల్లోని ఒక భాగం కొత్త ప్రాణంగా మారింది.. మా ప్రేమ రెట్టింపవుతోంది” అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ చూసి అభిమానులు, బుల్లితెర సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
A piece of our hearts has become a whole new life… our love is multiplying 🤗♥️@Itssoniyaakula #yashveeragoni #soniyaakula #parentstobe #pregnency #yashsoniya #yourssoniya #pregnancyreveal #yespalveeragoni #parenthood #ceo #pregnancylife pic.twitter.com/RePm0trCWU
— Yash (@yashveeragoni) July 19, 2025
సోనియా తన ప్రియుడు యష్ వీర్‌ను 2024 డిసెంబర్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గ్రాండ్‌గా వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు, బుల్లితెర నటులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. బిగ్ బాస్ సీజన్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉంటుందని భావించిన సోనియా ఊహించని విధంగా నాల్గవ వారంలోనే ఎలిమినేట్ అయింది. కేవలం మూడు వారాలకే గుడ్‌బై చెప్పినప్పటికీ బాగా ఫేమ్ సంపాదించుకుంది.
A little miracle is on the way… We’re overjoyed 😍🤗@yashveeragoni ♥️
.
.
.#Pregnancyreveal #newadditions #yashveeragoni #soniyaakula #parentstobe #newbaby #yashsoniya #newbaby #yourssoniya #yash #mommytobe pic.twitter.com/feYSuiPc9K— Soniya Akula (@Itssoniyaakula) July 18, 2025
బిగ్ బాస్ తర్వాత సోనియా పలు టీవీ షోలు, ఈవెంట్లలో పాల్గొంటూ వచ్చింది. ‘ఇస్మార్ట్ జోడీ’ కపుల్ షోలో భర్తతో కలిసి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సోనియా మ్యారెడ్ లైఫ్‌ను, ఫ్యామిలీ లైఫ్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది.