Bigg Boss Telugu 9 : ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు? ఎవరు బయటకు వెళ్లే అవకాశం ఎక్కువ?

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్‌లో ఫ్లోరా షైనీ, సంజన, ఇమాన్యూయేల్, తనూజ్, శ్రష్ఠి, సుమన్, రీతూ చౌదరి, రాము రాథోడ్, డిమోన్ పవన్ ఉన్నారు. అయితే వీరిలో ఈ వారం హౌస్ నుంచి సంజన, ఫ్లోరా షైనీ లేదా సుమన్ బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రేక్షకుల అభిప్రాయాలు చెప్పాలంటే, బిగ్ బాస్ ప్రస్తుతం ఊహించినంత ఆసక్తికరంగా సాగడం లేదు. కొందరు ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారని, కంటెస్టెంట్స్ కూడా పెద్దగా కామెడీ చేయడం లేదని ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. షో మొదలైన రెండు రోజుల్లోనే కంటెస్టెంట్స్ ఆట ప్రారంభించగా, మొదటి రోజే హౌస్‌లో చిన్న గొడవలు మొదలయ్యాయి. ఇమ్మాన్యూయేల్ హరీష్‌ను “గుండు అంకుల్” అంటాడు, దీంతో చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది.

ప్రేక్షకులు ఎక్కువగా వీకెండ్‌లో వచ్చే నాగార్జున కంటే, సోమవారం జరిగే నామినేషన్స్‌ను ఎదురుచూస్తారు. ముఖ్యంగా, ఈ వారం సెలబ్రిటీ కంటెస్టెంట్స్‌తో పాటు కామనర్స్ కూడా నామినేషన్స్‌లో ఉన్నారు.

తాజాగా బిగ్ బాస్ టీమ్ ఒక ప్రోమోను విడుదల చేసింది. అందులో సంజన, షైనీ మధ్య బాత్రూమ్‌లో వస్తువులు తీసివేయడం గురించి గొడవ జరుగుతుంది. షైనీ, వస్తువులు క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని సంజనాకు చెప్పగా, పవన్ మధ్యవర్తిగా జోక్యం చేసుకున్నాడు.

ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో, ప్రేక్షకుల కోసం ఆసక్తికరంగా మారింది.

Leave a Reply