Rithu Chowdary : బిగ్‌బాస్‌ 9లోకి జబర్దస్త్‌ గ్లామర్‌ నటి రీతూ చౌదరి ఎంట్రీ!

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌ ద్వారా టెలివిజన్‌ ప్రేక్షకులకు పరిచయమైన నటి రీతూ చౌదరి ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ 9లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా గుర్తింపు పొందిన రీతూ, తన గ్లామర్‌తో వందలాది మంది అభిమానులను సంపాదించుకుంది. జబర్దస్త్‌ షోలో తన నటన, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె తరచూ సోషల్‌ మీడియాలో ఫోటోలు షేర్‌ చేస్తూ ఫాలోవర్స్‌ను మరింతగా పెంచుకుంటోంది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 7న ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌ 9 కంటెస్టెంట్స్‌ లిస్ట్‌లో రీతూ పేరు దాదాపు ఖాయమైందని తెలుస్తోంది.

అయితే, రీతూ గ్లామర్‌తో పాటు కొన్ని వివాదాల్లోనూ నిలిచింది. గతంలో బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ జరిపారు. అంతేకాకుండా రూ.700 కోట్ల ల్యాండ్‌ స్కామ్‌లో కూడా ఆమె పేరు వినిపించింది. కానీ రీతూ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. “అన్ని కోట్లు నా దగ్గర ఉంటే ఇలాంటి కష్టాలు ఎందుకు పడతా?” అంటూ స్పందించింది. ఈ వివాదాలన్నింటి తర్వాత బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూ, తనపై వచ్చిన ప్రతికూల ఇమేజ్‌ను మార్చుకోవాలని చూస్తోందని చెప్పుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

అదే సమయంలో, రీతూ వ్యక్తిగతంగా కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. రెండు సంవత్సరాల క్రితం తన తండ్రి మరణించడంతో కుటుంబానికి అండగా నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, సోషల్‌మీడియా ద్వారా గ్లామర్‌తో పాటు ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోంది. తన కష్టాలను గమనించినవాళ్లు ఆమెకు అభిమానులయ్యారు. ఇప్పుడు బిగ్‌బాస్‌ 9 వేదికగా రీతూ మరింత మంది ప్రేక్షకుల ప్రేమను గెలుచుకోవచ్చని అభిమానులు భావిస్తున్నారు.

Leave a Reply