Divvala Madhuri : బిగ్ బాస్ 9లోకి దివ్వెల మాధురి ఎంట్రీ.. సోషల్ మీడియాలో వైరల్

ప్రముఖ రాజకీయ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దివ్వెల మాధురి బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొనబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె హౌస్‌లోకి వస్తే ఎలా ఎంటర్‌టైన్ చేస్తారో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది.

బుల్లితెర ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఫుల్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న బిగ్ బాస్ ఇప్పటికే 8 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు సెప్టెంబర్ 7 నుంచి సీజన్ 9 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ జాబితా గురించే చర్చ ఎక్కువగా నడుస్తోంది.

ఈసారి షోలో రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తి ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అదే దివ్వెల మాధురి. బోల్డ్ పర్సనాలిటీ, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తే షో మరింత ఆసక్తికరంగా మారుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

బిగ్ బాస్ ప్రతీసారి కొత్త కాన్సెప్ట్‌తో వస్తుంటాడు. ఈసారి కూడా “డబుల్ హౌస్ డబుల్ డోస్” ట్యాగ్‌లైన్‌తో సీజన్ 9ను ప్రకటించారు. సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కూడా ఈ సీజన్‌లో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే కామనర్స్ ఎంపిక కోసం ‘అగ్నిపరీక్ష’ అనే ప్రీ-షోను నిర్వహించి, 40 మందిలో నుంచి టాప్ 5 మందిని ఎంపిక చేసి హౌస్‌లోకి పంపించనున్నారు. దీంతో ఈసారి సీజన్ సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ గా రసవత్తరంగా ఉండబోతోందని తెలుస్తోంది.

సెలబ్రిటీ కంటెస్టెంట్స్ విషయానికొస్తే, అధికారిక లిస్ట్ ఇంకా బయటకు రాకపోయినా సోషల్ మీడియాలో పలు పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో రేఖా భోజ్, సింగర్ శ్రీతేజ, బ్రహ్మముడి కావ్య శ్రీ, అలేఖ్య (చిట్టి పికిల్స్), నటి కల్పిక గణేష్, సీరియల్ నటి దేబ్జానీ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, సాయి కిరణ్, సీతాకాంత్, శివకుమార్ (ప్రియాంక జైన్ బాయ్‌ఫ్రెండ్), హారిక-ఏక్ నాథ్ కపుల్, తేజస్విని గౌడ పేర్లు ఉన్నాయి.

Leave a Reply