వినాయక చవితి కోసం పోలీసుల కీలక ఆదేశాలు.. తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు

ఆగస్టు 27 నుంచి దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ముఖ్యమైన ఆదేశాలను జారీ చేశారు.

బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకునే నిర్వాహకులు తప్పనిసరిగా ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. ఈ అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం పోలీసులు ప్రత్యేకంగా వెబ్‌సైట్ లింక్‌ (https://policeportal.tspolice.gov.in/index.htm) అందుబాటులో ఉంచారు.

Also Read : MLA లకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. రాజశేఖర్‌రెడ్డి వివాదంపై ఆగ్రహం

మండపాలపై నియమాలు

మండపాల కోసం రోడ్లను పూర్తిగా మూసివేయకూడదు. కనీసం బైక్ వెళ్లే దారి తప్పనిసరిగా ఉండాలి.

ట్రాఫిక్, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదు.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడకూడదు.

డీజేలకు అనుమతి లేదు. మండపాల వద్ద కేవలం రెండు బాక్స్ టైప్ లౌడ్ స్పీకర్లను మాత్రమే వాడాలి.

మండపాల వద్ద శాంతిభద్రతల కోసం నిర్వాహకులు కనీసం ముగ్గురు వాలంటీర్లను నియమించాలి.

అగ్నిప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న మండపాల వద్ద ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించాలి.

అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

Also Read : అందుకే సినిమాలు తగ్గించా.. మొత్తానికి నోరు విప్పిన సమంత..!

విగ్రహం ఎత్తు, నిమజ్జనం నియమాలు

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే విధంగా నియమాలు అమల్లోకి వచ్చాయి. మండపం ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా ganeshutsav.net వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకుని ఉచిత అనుమతి పత్రం పొందాలి.

దరఖాస్తు చేసిన తర్వాత, పోలీసులు స్థలాన్ని పరిశీలించి నిబంధనలు పాటిస్తే QR కోడ్‌తో కూడిన నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేస్తారు.

విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ, సమయం, ఊరేగింపు మార్గం వంటి వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలి.

రోడ్లు, ఫుట్‌పాత్‌లు లేదా రహదారులపై మండపాలను ఏర్పాటు చేయరాదు.

మండపాల వద్ద మద్యం సేవించడం, జూదం ఆడటం, లక్కీ డ్రాలు నిర్వహించడం, మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే ప్రసంగాలు లేదా పాటలు వినిపించడం పూర్తిగా నిషేధం.

Leave a Reply