Ganesh Chaturthi 2025: వినాయక చవితి 2025 పూజా విధానం.. నైవేద్యాలు, మంత్రాలు & జాగ్రత్తలు

2025 ఆగస్టు 27, బుధవారం గణనాథుడి జన్మదినమైన వినాయక చవితి జరగనుంది. ఈ రోజు విఘ్నాలను తొలగించే గణపయ్యను సక్రమంగా ఆరాధిస్తే ఏడాదంతా శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి, ఆ రోజున పూజ ఎలా చేయాలి? ఏ నైవేద్యాలు సమర్పించాలి? ఏ మంత్రాలు జపించాలి? తెలుసుకుందాం.

పూజకు కావాల్సినవి

పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, అగరుబత్తులు, తమలపాకులు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరణం, ప్రమిదలు, నెయ్యి/నూనె, వత్తులు, 21 రకాల పత్రి, నైవేద్యాలు.

పూజా విధానం

ఉదయం ఇంటిని శుభ్రపరచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి.

పూజామందిరాన్ని పసుపు, కుంకుమ, తోరణాలతో అలంకరించాలి.

గణనాథుడి విగ్రహాన్ని ఉత్తరం/తూర్పు/ఈశాన్యం దిక్కున ఏర్పాటు చేయాలి.

బియ్యం, తమలపాకులపై కలశం ఉంచి దీపారాధన చేయాలి.

వెండి లేదా మట్టి ప్రమిదలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శుభఫలితం ఉంటుంది.

గరికపోచల జంటతో పూజ చేయడం ద్వారా “సిద్ధి – బుద్ధి” అనుగ్రహం లభిస్తుంది.

21 రకాల పత్రి దొరకకపోయినా గరికపోచల జంటతో పూజ చేస్తే సమాన ఫలితమే వస్తుంది.

ఎరుపు పూలు (మందారం, ఎర్ర గులాబీ)తో గణపతి అష్టోత్తరం చదవాలి.

నైవేద్యాలు

ఉండ్రాళ్ల పాయసం తప్పనిసరిగా సమర్పించాలి.

ఎరుపు రంగు పండ్లు (గణపయ్యకు ఇష్టమైనవి) పెట్టాలి.

ఈసారి పండుగ బుధవారం వస్తున్నందున ఆకుపచ్చ పండ్లను కూడా సమర్పించడం శుభప్రదం.

జపించాల్సిన మంత్రాలు

విఘ్నాలు తొలగించాలంటే:
వక్రతుండాయ హూం” –- 21 సార్లు జపించాలి.

కోరికలు నెరవేరాలంటే:
గం క్షిప్రప్రసాదనాయ నమః” – 21 సార్లు జపించాలి.

చంద్రుణ్ని చూడటం తప్పనిసరి జాగ్రత్త

వినాయక చవితి రోజున పొరపాటున చంద్రుణ్ని చూస్తే నిందలు రాకుండా ఉండేందుకు ఈ శ్లోకం చదవాలి:

“సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతాహతః |
సుకుమారకమారోధిః తవ హ్యేష స్యమంతకః ||”

పూజా అక్షింతలను తలపై చల్లుకుంటూ ఈ శ్లోకం జపించాలి.

vinayaka-chavithi-pooja-vidhanam.pdf

ఇలా శ్రద్ధగా వినాయక చవితి పూజ చేస్తే, గణనాథుడి అనుగ్రహంతో ఏడాది మొత్తం విజయాలు, శుభాలు లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Leave a Reply