శ్రావణ మాసం పవిత్రమైనది, భక్తి, శ్రద్ధతో పూజలు చేస్తే కోరుకున్న ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కానీ, ఈ మాసంలో తెలియక కొన్ని పనులు చేస్తే దరిద్ర దేవత కట్టిపడేస్తుందని అంటున్నారు. అందుకే శ్రావణ మాసంలో అసలు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మాంసాహారం, మద్యపానం వర్జ్యం
ఈ మాసంలో మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటివి తీసుకోకూడదు. అలాగే మద్యపానం, ధూమపానం చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుందని, అనుకున్న పనులు ఆగిపోతాయని పండితులు చెబుతున్నారు.
గడ్డపెరుగు, హింస, చెడు ఆలోచనలు వద్దు
శ్రావణంలో గడ్డపెరుగు తినకూడదు. మజ్జిగ లేదా పల్చని పెరుగు తీసుకోవచ్చు. అలాగే జీవులపై హింస చేయకూడదు. కోపం, ద్వేషం వంటి చెడు ఆలోచనలు మనసులో ఉంచకూడదు.
జుట్టు కత్తిరించుకోవడం, నూనె రాయడం మానేయాలి
ఈ పవిత్ర మాసంలో జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం, శరీరానికి నూనె రాసుకోవడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు.
పగటి నిద్ర, రాగి పాత్రలు వాడరాదు
పగటి పూట నిద్రపోవడం పాపమని చెబుతారు. అలాగే రాగి పాత్రల్లో వండిన వంటలు తినకూడదు.
బ్రహ్మచర్యం పాటించాలి, తులసి ఆకులు వద్దు
శ్రావణంలో తప్పక బ్రహ్మచర్యం పాటించాలని, శివపూజలో తులసి ఆకులు వాడకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు.
వాయనం ఇవ్వడంలో జాగ్రత్త
వాయనం ఇచ్చే సమయంలో ముత్తైదువులను గౌరవించాలి. విరిగినవి, పాడైనవి ఇవ్వకూడదు. శుభ్రంగా, పవిత్రంగా వాయనం ఇవ్వడం వల్ల శుభఫలితాలు వస్తాయని అంటున్నారు.
మొత్తం గా
శ్రావణ మాసంలో భక్తితో, నియమ నిష్టలతో ఉంటే సంపద, శాంతి, సౌఖ్యాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. చిన్న తప్పులు కూడా దరిద్రాన్ని తీసుకొస్తాయని గుర్తుంచుకోవాలి.