IPL 2023: ఇంకా బాలకృష్ణ ప్యాన్స్ కి పండగే
నట సింహ నందమూరి బాలకృష్ణ, సినీ నటుడిగా , రాజకీయ నాయకుడిగా ఎంతో గుర్తింపు ఉంది. హీరోగా బాలకృష్ణకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినిమాలే కాదు బుల్లితెరపై టాక్ షోలోకు హోస్టుగా వ్యవహారిస్తూ సత్తా చాటారు.
ఇప్పుడు బాలయ్య బాబు తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. క్రికెట్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు కామెంటేర్ గా అవతారం ఎత్తేందుకు బాలయ్యబాబు రెడీ అవుతున్నారు. అయితే క్రికెట్ ను ఏపీ, తెలంగాణ వంటి కీలక మార్కెట్లలోకి తీసుకెళ్లే స్టార్ స్పోర్ట్స్ ప్రయత్నంలో భాగంగా ఈ భాగస్వామ్యం కుదిరింది. క్రికెట్ అంటే అమితమైన అభిమానం ఉన్న బాలకృష్ణ కాలేజీ రోజుల్లోనే క్రికెట్ లో యాక్టివ్ గా ఉండేవారు. భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ వంటి వారితో కలిసి ఆడి ఆటపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.
భారత మాజీ క్రికెటర్లు వేణుగోపాల్ రావు (ఐపీఎల్ టైటిల్ విన్నర్), ఎమ్మెస్కే ప్రసాద్ (మాజీ చీఫ్ సెలెక్టర్), మిథాలీ రాజ్ (భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్) నాయకత్వంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆటకు మొదటి గమ్యస్థానంగా మారింది. గత కొన్ని నెలలుగా తెలుగులో క్రికెట్ ప్రసారాలకు ఆదరణ విపరీతంగా పెరిగిందని, ఇటీవల భారత్ ఆడిన ద్వైపాక్షిక టీ20లకు వీక్షకుల సంఖ్య 20 శాతం పెరిగిందన్నారు. ఇప్పుడు బాలయ్య ఈ ఏడాది ఐపీఎల్ లో రావు, ప్రసాద్ లతో కామెంటరీ బాక్స్ పంచుకోబోతున్నారు. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ మేళవింపును సరికొత్త స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. Ask Star ద్వారా తొలిసారిగా టీవీలో బాలయ్య లైవ్ ను వీక్షించే, ఎంగేజ్ అయ్యే అవకాశం అభిమానులకు లభిస్తుంది.
IPL 2023 బాలకృష్ణ కామెంటరీతో అదరగొట్టనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. మార్చి 31న ప్రారంభం కానున్న ఐపీఎల్ ఓపెనింగ్ రోజు బాలయ్య బాబు కామెంటరీ ఉంటుందని వెల్లడించింది. దీనికి సంబంధించి ట్వీట్ కూడా పెట్టారు.
అలాగే బాలకృష్ణ క్రికెట్ లైవ్ లో కనిపిస్తారు – భారతదేశం యొక్క అత్యధికంగా వీక్షించబడిన క్రికెట్ షో ఇది ఈ ఎడిషన్ లో కొత్త ఫార్మాట్ ను కలిగి ఉంటుంది. స్టార్ స్పోర్ట్స్ తెలుగుతో తనకున్న అనుబంధం గురించి బాలకృష్ణ మాట్లాడుతూ స్టార్ స్పోర్ట్స్ తెలుగులో ఐపిఎల్ తో అసోసియేట్ కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కొత్త ప్రయాణంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని, ఇది అందరికీ ప్రత్యేకమైన సీజన్ అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
స్టార్ స్పోర్ట్స్ ప్రతినిధి మాట్లాడుతూ బాలకృష్ణతో అసోసియేట్ కావడం ఆనందంగా ఉందని, ఈ భాగస్వామ్యం తమ ప్రసారానికి కొత్త కోణాలను జోడిస్తుందని అన్నారు. వ్యాఖ్యానానికి బాలయ్య చరిష్మా, నిస్సంకోచమైన అభిప్రాయాన్ని తీసుకువస్తారని ఆయన అన్నారు. అలాగే స్టార్ స్పోర్ట్స్ ప్రచారం ‘షోర్ ఆన్, గేమ్ ఆన్ సూపర్ స్టార్లతో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కింగ్ కోహ్లీ చేసిన ‘హర్ ఘర్ బనేగా స్టేడియం’ అనే నినాదం కూడా వైరల్గా మారింది. తెలుగు కామెంటరీ ప్యానెల్ లో టి.సుమన్, ఆశిష్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణ కూడా ఉన్నారు.
ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్😎
ఓపెనింగ్ డే విత్ మన లెజెండ్🤩
నందమూరి బాలకృష్ణ గారు😍తెలుగుజాతి గర్వపడేలా 🔥
సంబరాన్ని అంబరాన్ని అంటేలా🥳
ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉండబోతుంది🤩మరి మిస్ అవ్వకుండా చూడండి StarSportsTelugu/HD#IPLOnStar #JaiBalayya #BalaKrishna #HushaaruOn pic.twitter.com/GpARnqMdgg
— StarSportsTelugu (@StarSportsTel) March 26, 2023