నాకు ఆంధ్ర ప్రదేశ్ రావాలంటే భయం వేస్తుంది. నాపై కుట్ర జరుగుతుంది అందువల్లే నేను హైదరాబాద్ లో ఉన్నాను. నాకు ప్రాణ హాని ఉంది నాకేం జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డిదే బాధ్యత వహిస్తాడు అని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ రోజు మీడియా సమావేశంలో అన్నరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీదేవి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు వైసీపీ అధిష్టానం భావించి సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె మొదటి సారి ఆమే భర్త తో కలసి ఈ రోజు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.
నాపై కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడుతున్నారు. నేను దళిత ఎమ్మెల్యేను అందుకే పార్టీలో నాకు సరైన గుర్తింపు లేదు. అమరావతి రాజధాని ఉద్దండయ్యపాలెంలో ఇసుక మాఫియా ఎవరిది. దానికి నేను అడ్డం వస్తున్నాను అని ఈ విధంగా నన్ను పార్టీ నుంచి తప్పించారు. పిచ్చి కుక్కతో సమానంగా నన్ను చూశారు అని ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపించారు.
అలగే సీఎం జగన్ చేసిన పనికి తన మైండ్ బ్లాంక్ అయిందని షాకుల మీద షాకులు ఇచ్చారని ఈ సందర్భంగా శ్రీదేవి ఫైర్ అయ్యారు. వైఎస్సార్ తనయుడు పార్టీ అంటే విలువలతో ఉంటాయనుకున్నా కానీ రాజకీయాల్లో ఎలాంటి విలువ లేని రాజకీయాలు ఉంటాయని నేను అనుకోలేదని తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని అనారోగ్యంలోనూ సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి గామంలో తిరిగానని శ్రీదేవి అన్నారు. ఇంత కష్టా పడ్డ తనపై సస్పెన్షన్ వేటు వేశారని ఆమే ఆవేదన వ్యక్తం చేశారు. తన వివరణ తీసుకోకుండానే చర్యలు తీసుకున్నారని వాపోయారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలోనూ చేరట్లేదని, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఆమె స్పష్టం చేశారు.
కాగా తనను అవమానించిన వారికి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారు ఆమే ఈ సందర్భంగా తెలిపారు. మొన్నటివరకు నాతోపాటు ఉన్నవారే నా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. నియోజకవర్గ ప్రజలు కలిసి వస్తే నేను వారి సమస్యపై పోరాటం చేస్తాను. అలాగే అమరావతి రైతుల కోసం ప్రాణం పోయేదాకా పోరాటం చేస్తా అని ఈ సందర్భంగా ఆమె అన్నారు..