Rahul Gandhi disqualified from Lok Sabha: రాహుల్ గాంధీ పై అనర్హత వేటు
రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ ఈ రోజు నోటీసులు జారీ చేశారు. ‘మోదీ ఇంటిపేరు’ను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు ఆయనకు దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వానికి అనర్హులయ్యారు. వయనాడ్ ఎంపీపై నమోదైన కేసులో సూరత్ కోర్టు మార్చి 23న ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష విధించిన మరుసటి రోజే ఆయనపై అనర్హత వేటు పడింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఈ), ప్రజా ప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్ 8 ఆధారంగా ఆయనపై అనర్హత వేటు వేసినట్లు వివరించారు లోక్‌సభ సెక్రటరీ. కేరళలోని వాయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందిన రాహుల్ గాంధీ, తాజా పరిణామాల నేపథ్యంలో లోక్‌సభలో తన ప్రాతినిధ్యాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం రాహుల్, కాంగ్రెస్ నేతకు ప్రస్తుతానికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పాటు పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో దొంగలందరికీ మోడీ ఇంటి పేరు ఎలా వచ్చింది అంటూ కామెంట్స్ చేశారు రాహుల్. అలా రాహుల్ ఆ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ రాహుల్ గాంధీపై సూరత్ క్రిమినల్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. హుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్లు 499, 500 (పరువు నష్టం) కింద కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీ ర్యాలీలో ఉద్దేశ పూర్వకంగా ఆయన ప్రసంగం చేశారంటూ సీడీలను పూర్ణేష్ మోడీ తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. డంతో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి మార్చి 23న రెండేళ్ల జైలు శిక్ష విధించింది.