రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ ఓడరేవు మారిపోల్ ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆకస్మికంగా సందర్శించారు. పుతిన్ రాత్రివేళల్లో వీధుల్లో కారు నడుపుతూ ప్రజలతో మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియో శనివారం అర్థరాత్రి ఘాట్ చేసినట్లు తెలుస్తుంది. కొత్తగా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగానికి ఆయన చేసిన తొలి పర్యటన ఇదేనని భావిస్తున్నారు.
కాగా పుతిన్ నేరస్తుడని, నేరం జరిగిన ప్రాంతానికి తిరిగి వచ్చాడని మారిపోల్ బహిష్కృత మేయర్ అన్నారు. “అతను ఏమి చేశాడో చూడటానికి అతను వ్యక్తిగతంగా వచ్చాడు” అని వాడిమ్ బోయ్చెంకో చెప్పారు. “అతనికి ఏ శిక్ష పడుతుందో చూడటానికి వచ్చాడు.” అంటూ ఆయన పేర్కొన్నారు. కాగా ఘర్షణలో సుదీర్ఘమైన మరియు రక్తసిక్తమైన యుద్ధాలలో ఒకటైన మారియోపోల్ 10 నెలలకు పైగా రష్యా ఆక్రమణలో ఉంది. కాగా ఈ యుద్దం లో 20 వేల మందికి పైగా ఉక్రెయిన్ వారు చనిపోయారు. ఐక్యరాజ్యసమితి విశ్లేషణ ప్రకారం 90% భవనాలు దెబ్బతినగ, యుద్ధానికి ముందు సుమారు 500,000 జనాభా ఉండగా సుమారు 350,000 మంది ప్రజలు బలవంతంగా విడిచిపెట్టబడ్డారు,.
పగటిపూట ధ్వంసమైన నగరాన్ని చూడకుండా ఉండేందుకు పుతిన్ రాత్రిపూట సందర్శించారని బహిష్కరణకు గురైన ఉక్రెయిన్ నగర అధికారులు తెలిపారు. మరియుపోల్ వెళ్లాలన్న పుతిన్ నిర్ణయం ఆకస్మికమేనని క్రెమ్లిన్ పేర్కొంది. మరియుపోల్ కు తూర్పున ఉన్న రష్యన్ నగరమైన రోస్టోవ్-ఆన్-డాన్ లో రష్యా నాయకుడు ఉన్నత సైనిక కమాండర్లతో సమావేశమయ్యారు.
హెలికాఫ్టర్ లో మారిపోల్ కు వెళ్లినట్లు టాస్ వార్తా సంస్థ తెలిపింది. ఈ వీడియోలో ఆయన రష్యా ఉప ప్రధాని మరాట్ ఖుస్నులిన్ తో కలిసి కారులో ఉన్నారు, అతను నగరాన్ని ఎలా పునర్నిర్మిస్తున్నారో వివరిస్తున్నాడు. ఉక్రెయిన్ దళాలు లొంగిపోయే ముందు మోహరించిన భారీ పారిశ్రామిక సముదాయమైన అజోవ్‌స్టల్ ఇనుము మరియు ఉక్కు కర్మాగారం యొక్క రక్షకుల విచారణలను నిర్వహించడానికి ఉపయోగించే ఫిల్హార్మోనిక్ హాల్‌ను కూడా పుతిన్ సందర్శించినట్లు తెలుస్తోంది.
నగరాన్ని పునర్నిర్మించడానికి, ప్రజల మనసులను గెలుచుకోవడానికి రష్యా ఖరీదైన ప్రచారాన్ని నిర్వహిస్తోందని స్థానికులు చెబుతున్నారు. మరియుపోల్ ను విలీనం చేసి రష్యాకు సొంతం చేసుకోవడమే దీని ఉద్దేశం. ప్రస్తుతం అక్కడ 3,00,000 మంది నివసిస్తున్నారని రష్యా అధికారులు చెబుతున్నారు.
వందలాది మంది పౌరులు ఆశ్రయం పొందుతున్న మారిపోల్ థియేటర్ పై రష్యా దాడి చేసింది. భవనం కూలడంతో అక్కడ కనీసం 300 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఉక్రెయిన్, మానవహక్కుల సంఘాలు ఈ దాడిని యుద్ధ నేరంగా భావిస్తున్నాయి. దీనికి పుతిన్, ఆయన ప్రభుత్వం చట్టపరంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఉక్రెయిన్ పిల్లలను అక్రమంగా రష్యాకు పంపిన కేసులో పుతిన్ అరెస్టుకు వారెంట్ జారీ చేసినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు శుక్రవారం తెలిపింది. అంటే కోర్టుకు ఉన్న 123 సభ్యదేశాల్లో దేనిలోనైనా కాలు పెడితే అరెస్టు చేయవచ్చు.