CM Jagan : నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ
ఆంద్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ఖరారు అయినట్లు తెలుస్తుంది. ఈరోజు రాత్రి 7.30 గంటలకు సీఎం హస్తినకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నట్ల సమాచారం . అసలు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశం జరుగుతుండగా సాయంత్రం ఆయన ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయికాగా రాష్ట్రంలోని సమస్యలు, పెండింగ్ బకాయిలు వంటి అంశాలకు సంబంధించి ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది.
అలాగే రాష్ట్రాభివృద్ధిపై పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇవ్వాలనే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఇటీవల గ్లోబల్ సమ్మిట్ లో, కేబినెట్ భేటీలో విశాఖ నుంచి పరిపాలన జరుగుతుందని మంత్రులకు సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాజధాని అంశంపై కూడా కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. విశాఖ నుంచి పాలన జరుగుతుందని సమాచారం ఇవ్వబోతున్నారనే చర్చ నడుస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు సీఎం జగన్ పర్యటనపై ఉత్కంఠ రేపుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ 4 ఏళ్లలో సీఎం జగన్ ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లారు. కానీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశం అనంతరం ఆయన ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లడంపై ఏపీలోఈ విషయం ఇప్పుడు హాట్ టాపిగా మారింది.