Badrachalam Temple :భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా వసంతోత్సవం వేడుకలు
ఈ నెల 30 న జరగనున్న సీతారాముల కళ్యాణానికి పాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు నుంచి స్వామివారి పెళ్లి పనులను ఆలయ అర్చకులు ప్రారంభించారు. వసంతోత్సవ వేడుకల్లో భాగంగా రోలు, రోకలికి పూజలు చేసి ముత్తైదువులతో పసుపు కొమ్ములు దంచి పసుపు తయారు చేసి మహిళలు కళ్యాణ తలంబ్రాలు కలిపారు. అనంతరం బేడా మండపంలో స్వామివారిని పెండ్లి కుమారునిగా ముస్తాబు చేసి ఉత్సవ మూర్తులకు వసంతాలు చల్లి ఘనంగా డోలోత్సవం, వసంతోత్సవం వేడుకలు నిర్వహించారు.
ఈనెల 30, 31 తేదీలలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ పనులను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ముందుగా ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ఉత్తర ద్వారo వద్దకు తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యవార్లు, ముత్తైదువలు పసుపు దంచి కళ్యాణ పనులను మొదలుపెట్టారు. పసుపు, కుంకుమ, గులాలు, అత్తరులు, సుగంధ ద్రవ్యాలతో భక్తులు కళ్యాణ తలంబ్రాలు కలిపారు. అశేష భక్త జనంతో ఉత్తర ద్వారo వద్ద రామనామ స్మరణల మధ్య కన్నుల పండుగగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంతోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఇది కూడా చదవండి :