పెళ్ళికి నిరాకరించిందని యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
బెంగళూరులో కాకినాడ యువతిని శ్రీకాకుళం యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఆమె పనిచేసే ఆఫీసు వద్దే ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడు. విచక్షణారహితంగా 16 సార్లు కత్తితో పొడిచి పొడిచి చంపాడు. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. మురుగేశ్పాల్యలో నిన్న మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఈ హత్యోదంతం చోటుచేసుకుంది. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడకు చెందిన లీలా పవిత్ర (25) తూర్పు బెంగళూరులోని మురుగేశ్పాల్యలో ఉన్న ఒమెగా హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ సర్వీసెస్‌లో ఉద్యోగం చేస్తోంది. శ్రీకాకుళానికి చెందిన నిందితుడు దినకర్ (28) కూడా దొమలూరులో ఓ హెల్త్‌కేర్ సంస్థలోనే పనిచేస్తున్నాడు.
అయితే గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఇరువురూ పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇద్దరిదీ వేర్వేరు కులాలు కావడంతో లీలా కుటుంబం మాత్రం ఈ పెళ్లికి అభ్యంతరం చెప్పింది. ఈ విషయం తన ప్రియుడు దినకర్‌కి లీలా ఈ విషయం చెప్పింది. తాను తల్లిదండ్రులు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, వాళ్లు చూసిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని దినకర్‌కి చెప్పింది. ప్రియురాలి నోటి నుంచి అటువంటి మాట వస్తుందని ఊహించని అతడు ఆగ్రహంతో వూగిపోయాడు తనకు దక్కందని మరెవరికీ దక్కకూడదని లీలాను ఆమె పనిచేసే ఆఫీసు వద్దే కత్తితో దాడిచేసి చంపాడు. కాసితిర 16 సార్లు ఆమెను పొడిచి పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు. అక్కడకు చేరుకుని రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న లీలను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడు దినకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు విధులు ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత ఇరువురి మధ్య పెళ్లి విషయమై వాగ్వాదం జరిగింది. పెళ్లి గురించి మరోసారి అతడు లేవనెత్తగా తల్లిదండ్రులు చెప్పినట్టు వింటానని చెప్పింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన వెంట తెచ్చుకున్న కత్తితో అందరూ చూస్తుండగానే ఆమెపై దాడి చేశాడు.