హాట్ కేకులగా అమ్ముడు అయ్యిన శ్రీ వారి దర్శనం టిక్కెట్ లు
కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. వచ్చే రెండు నెలలు దర్శనం కోసం సేవా టికెట్లను టీటీడీ ఆన్ లైన్ ద్వారా కోటా విడుదల చేసింది. భక్తుల నుంచి టోకెన్లు పొందేందుకు రికార్డ్ స్థాయిలో స్పందన కనిపించింది. అంచనాలకు మించి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఆన్ లైన్ విధానం టోకెన్లు పొందేందుకు భారీ డిమాండ్ ఏర్పడింది. రెండు నెలలకు సంబంధించిన అంగప్రదిక్షణ టికెట్లు కేవలం 9 నిమిషాల్లోనే అయ్యిపోయాయి. అదే విధంగా రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కు సంబంధించి ఆరు లక్షల టోకెన్లు కేవలం 85 నిమిషాల్లోనే అమ్మకం పూర్తయింది. మార్చి నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం సేవా టికెట్లను ఆన్ లైన్ ద్వారా భక్తులకు అందించారు.
వచ్చే నెలలో స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం తో పాటుగా అర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్ లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సారి గత రికార్డులను తిరగరాసేలా భక్తుల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. సీనియర్ సిటిజెన్స్, వికలాంగుల కోసం విడుదల కేసిన కోటా కూడా కేవలం 95 నిమిషాల్లోనూ పూర్తయింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందేందుకు భక్తులు టీటీడీ వెబ్ సైట్ తో పాటుగా యాప్ ద్వారా పెద్ద ఎత్తున ప్రయత్నించారు. దీంతో కేవలం 85 నిమిషాల్లోనే 6 లక్షల టోకెన్లు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఈ మధ్యాహ్నం మూడు నెలలకు సంబంధించిన 46 వేల శ్రీవారి టికెట్లను అందుబాటులో ఉంచారు.ఇప్పటికే శ్రీవారి టికెట్లకు భారీ స్పందన కనిపిస్తోంది. టీటీడీకి అనూహ్యంగా టోకెన్ల ద్వారా రూ 10 కోట్ల మేర ఆదాయంతో కొత్త రికార్డు నమోదైంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన శ్రీవారి టికెట్ల ఆన్ లైన్ కోటాను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంచారు. ఆన్ లైన్ ద్వారా రోజుకు 500 టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీవారి టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంతో నూతనంగా దేవాలయాలు సౌకర్యాల పెంపుకు వినియోగిస్తున్నారు. శ్రీవారి టికెట్లకు ప్రారంభించిన సమయం నుంచి పెద్ద సంఖ్యలో ఆన్ లైన్ విధానంలో పొందేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తిరుమలలోని గోకులం కార్యాలయంలో ఫిబ్రవరి 22 నుంచి ఆఫ్లైన్లో శ్రీవారి టిక్కెట్లను అందిస్తారు. ఫిబ్రవరి 28 వరకు రోజుకు 150 టిక్కెట్లు ఇవ్వనున్నారు. మార్చి నుంచి ఇదే కార్యాలయంలో నిత్యం అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి :