Kondagattu : దశ మారునున్నకొండగట్టు ఆలయం
Kondagattu : తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో కొండగట్టు అంజనేయస్వామి ఆలయం ఒకటి. ఇది జగిత్యాల జిల్లాలోని ఉంది.
ఇక్కడికి ప్రతీ ఏటా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తువుంటారు.
అయితే గత ఏడాది డిసెంబర్లో జగిత్యాల జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేదుకు రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.
త్వరలోనే వచ్చి ఆగమశాస్త్రం ప్రకారం భారతదేశంలోనే సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఈ నేపధ్యంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం కొండగట్టు అభివృద్ధికి రూ.100కోట్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
అయితే తాజాగా కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100కోట్ల నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆలయ అభివృద్ధికి నిధులను విడుదల నిధులు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అభివృద్ధికి నిధులను విడుదల నిధులు కేటాయించినందుకు ,సీఎం కేసీఆర్కు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ధన్యవాదాలు తెలిపారు.
కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులను విడుదల చేసిన కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.
అసలు గత ప్రభుత్వాల హయాంలో దేవాలయాల అభివృద్ధి గురించి అసలు పాటించుకోలేదు అనిఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో యాదాద్రి, వేములవాడ దేవస్థానాలు అభివృద్ధి చెందాయని వెల్లడించారు.
మళ్ళీ ఇప్పుడు మన కేసిఆర్ గారు ప్రత్యేక చొరవతో కొండగట్టు దశ ,దిశ మారనుందని ఎమ్మెల్యే అన్నారు.
ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వేములవాడలో పార్కింగ్ ఇబ్బందులు తప్పాయని పేర్కొన్నారు.
హిందుత్వ ముసుగులో ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్కపైసా కూడా తీసుకురాలేదని ఎమ్మెల్యే విమర్శించారు.
అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని ఆయన బండి సంజయ్కు సవాల్ చేశారు.
ఇది కూడా చదవండి :0