Jagan moohan : మసిపూసి మారేడుకాయ చేసాడు మా జగన్
Jagan moohan : చేసిన తప్పు కప్పిపుచ్చడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు.
వ్యక్తిగతంగా అయితే ఎలా అయినా కప్పొచ్చు, కాని ముఖ్యమంత్రి జగన్ తాను చేసిన తప్పును కప్పిపుచ్చడానికి మరింత ప్రజా ధనాన్ని వ్యయం చేస్తూ తమ తప్పును కప్పిపుచ్చుతున్నారు.
వైజాగ్ రుషికొండ.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక స్థలం. ఈ కొండ జగన్ పదవిలోకి రాకముందు పచ్చగా ప్రకృతితో అలరారుతుండేది. జగన్ ప్రభుత్వం పదవిలోకి రాగానే ముప్పాతికభాగం కొండను తవ్వేశారు.
అడిగిన వారికి టూరిజం వ్యాప్తి చేయడానికి అని ఓ కారణం, లేక ఇసుక మాఫియా వాళ్ళు చేశారని మరో కారణం చెబుతూ ప్రకృతి ఒడిని చీల్చి చెండాడారు.
ఇప్పుడు ఇదే వైజాగ్ నగరాన్ని జగన్ రాజధానికి మార్చాలి అనుకుంటున్న తరుణంలో రాబోయే రెండు నెలల్లో కొన్ని పెద్ద సమావేశాలను నగరంలో ఏర్పాటు చేశారు.
దీనికి ప్రపంచం నలుమూలల నుండి దేశ విదేశ ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.
దీంతో ప్రభుత్వ మంత్రాంగమంతా కంగారు పడి రుషికొండకు తాము పెట్టిన రంధ్రాన్ని పూడ్చే ప్రయత్నం చేశారు.
అమేజాన్ అడువుల్లో దొరికే అతి విలువైన మొక్కలతో కూడిన ఓ మ్యాట్ ను తీసుకువచ్చి రుషికొండ మీద పెట్టారు.
పెట్టారు అనే కన్నా తాము చేసిన రంధ్రాన్ని మ్యాట్ అనే దుప్పటితో కప్పారు అన్నది సమంజసంగా వుంటుంది.
ఏది ఏమైనప్పటికీ ప్రపంచం గుడ్డిది అని నమ్మే వ్యక్తులలో మా జగనన్న ముఖ్యుడు.
ఎందుకంటే కొండకి గోతులు వేసేటపుడు కాని ఆ గోతులు మీద మ్యాట్ కప్పేటపుడు కాని ఎవ్వరూ గమనించరని ముఖ్యమంత్రి గారి మెదడులో మెదిలిన మహత్తరమైన ఆలోచన..
అందుకే మసి పూసి మారేడుకాయ చేయడంలో మా మంత్రిగారు మహా దిట్ట. మరి ఇప్పుడో విషయం అంతా తెలిసి ఎవరేమనుకున్నా తుడుచుకుపోయే మహా మనస్తత్వం మా ముఖ్యమంత్రిగారిది.