ఈ రోజు నుండి హాత్ సే హాత్ జోడో అభియాన్
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సిద్ధమవుతున్న అన్ని రాజకీయ పార్టీలు పాదయాత్రల పేరుతో ప్రజా క్షేత్రంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళితే, ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్ర సాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేటి నుండి పాదయాత్రకు సిద్దాం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేటినుండి హాత్ సే హాత్ జోడో పాదయాత్రను నిర్వహించనున్నారు. ఈ మేరకు మొదటి రెండు రోజుల షెడ్యూల్ ను ములుగు ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు.
ఈ రోజు ఉదయం రేవంత్ రెడ్డివరంగల్ హైవే మీదుగా ములుగు చేరుకొని గట్టమ్మ,సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రను. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. మేడారం నుంచి కొత్తూరు, నార్లాపూర్, వరంగల్ ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర కొనసాగనున్నది. ప్రాజెక్ట్ నగర్లో భోజన తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం తర్వాత పస్రా కూడలిలో సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకొని రాత్రికి రేవంత్రెడ్డి అక్కడే బస చేయునున్నారు. ఈయన మొదటి విడతలో రేవంత్ రెడ్డి 60 రోజుల పాటు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించేలా రూట్ మ్యూప్ను సిద్దం చేసుకున్నారు. అటు రాష్ట్రానికి చెందిన సీనియర్లు కూడా పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు. జోడోయాత్రకు కొనసాగింపుగా ఆయా నియోజకవర్గాలు, జిల్లాల్లో హత్ సే హత్ జోడో పేరుతో పాదయాత్రలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: