Taraka Ratna Health Bulletin
నందమూరి తారకరత్న జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నా విషయం అందరకు తెలిసిందే.ఆ యాత్రలో భాగంగా ఓ మసీదులోకి వెళ్లి అందరూ బయటకు వచ్చారు. మళ్లీ పాదయాత్ర ప్రారంభించగా. కొద్దిసేపటికే నడుస్తూ ఉన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు ఆయన్ను దగ్గరలో ఉన్న కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమికంగా చికిత్స అందించి. కుప్పంలోనీ పీఈసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ తారకరత్నకు వైద్యం కొనసాగింది. అయితే కుప్పం పీఈసీ వైద్యుల సలహా మేరకు తారకరత్నను బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు.
అక్కడ డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, పురందేశ్వరి, నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరు వచ్చారు. ఆస్పత్రిలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే నారాయణ హృదయాలయ కూడా ఎప్పటికప్పుడు తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేస్తోంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నేడు డాక్టర్లకు కీలక నివేదిక రానుంది. మెదడులో కొంతమేర వాపు రావడంతో దాన్ని నయం చేసే చికిత్సపై ఫోకస్ చేశారు డాక్టర్లు. అయితే ఇప్పటికీ వెంటలేటర్పైనే ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నారు. ఆయన కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని ఆయనను పరామర్శించిన ప్రముఖులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో నేడు తారకరత్నకు సంబంధించిన ఓ హెల్త్ రిపోర్ట్ కీలక కానుందని హిందూపురం టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. EEG స్కానింగ్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. తారకరత్నకు అందుతున్న చికిత్సకు సంబంధించి అన్ని అంశాలను, ఆయన బాగోగులను నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: