నేషనల్ మాస్టర్ గేమ్స్ ఛాంపియన్ షిప్ -2023 @ హైదరాబాద్

Mnr

మీరు 2023లో పండుగ వాతావరణంలో క్రీడా సవాలు కోసం చూస్తున్నారా? అయితే ఈ ఫిబ్రవరి నెలలోనే ఓ హైఓల్టేజ్ స్పోర్ట్స్ ఈవెంట్ మన హైదరాబాద్ నగరం వేదికగా జరగబోతోంది. 5వ జాతీయ మాస్టర్ గేమ్స్ ఛాంపియన్‌షిప్ -2023 అనేది పాన్ ఇండియా అంతటా ఔత్సాహిక క్రీడాకారుల కోసం క్రీడాస్ఫూర్తిని తీసుకురావడానికి మరియు CSR కార్యకలాపానికి మద్దతునిచ్చేందుకు తోటి క్రీడాకారులతో పాల్గొనడానికి, పాల్గొనడానికి మరియు పోటీపడేందుకు ప్రొఫెషనల్ టోర్నమెంట్. ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఈ గేమ్స్ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి 2 నుండి 5వ తేదీ వరకు నిర్వహించబోతుంది. హైదరాబాద్ లో జరగనున్న 5వ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ లో బాస్కెట్ బాల్ బ్రాండ్ అంబాసిడర్ గా రిట్జీ గ్రూప్ సీఇఓ ఎమ్మెన్నార్ గుప్తా ఎంపికయ్యారు. 2019 సంవత్సరానికి గాను జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ లండన్ మరియు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిచే యంగ్ ప్రాడజీ గా గుర్తింపబడ్డ ఎమ్మన్నార్ గుప్తా టీటా ఓవర్సీస్ కోఆర్డినేటర్ గా మరియు ఎన్నారై విభాగ్ వామ్ గ్లోబల్ ఛైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ గేమ్స్ కు అంతర్జాతీయ స్థాయిలో ఎమ్మెన్నార్ గుప్తా బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ప్రముఖ ఎన్నారై అయిన ఎమ్మెన్నార్ గుప్తా తనకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీయం కెసీఆర్ కు మరియు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన కున్న అనుభవంతో ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో తగినంత గుర్తింపు తీసుకువస్తానని, తెలంగాణ రాష్ట్రానికి ఈ గేమ్స్ ఈవెంట్ తో అంతర్జాతీయంగా ఉన్నత స్థానం లభిస్తుందని వెల్లడించారు ఎమ్మెన్నార్ గుప్తా.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh