Hockey World Cup 2023: డ్రాగా ముగిసిన ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్ – పాయింట్ల పరిస్థితి ఏంటంటే?

హాకీ ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.

హాకీ ప్రపంచకప్ 2023లో ఇంగ్లండ్, టీమ్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిజానికి 12 పెనాల్టీ కార్నర్‌లలో కూడా ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. ఫలితంగా ఇరు జట్లు నాలుగు పాయింట్లతో సమంగా ఉన్నాయి.

భారత్, ఇంగ్లండ్‌లకు చెరో 4 పాయింట్లు

భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌ను 2-0తో ఓడించింది. ఇంగ్లండ్ తన తొలి మ్యాచ్‌లో వేల్స్‌ను ఓడించింది. భారత్, ఇంగ్లండ్ రెండూ నాలుగేసి పాయింట్లతో ఉండగా, భారీ గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టు అగ్రస్థానంలో ఉంది. భారత్ తన చివరి గ్రూప్ మ్యాచ్‌ని శనివారం వేల్స్‌తో ఆడనుంది. మంగళవారం జరిగే తన చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్పెయిన్‌తో తలపడనుంది. ఇక ఇండియా ఇంగ్లండ్ మ్యాచ్ గురించి చెబుతూ, ఇంగ్లండ్‌కు మొదటి నుంచి ఎన్నో అవకాశాలు వచ్చినా, అవకాశాలను గోల్‌గా మార్చుకోలేకపోయారు.

భారత్ కూడా తక్కువేమీ కాదు

ఈ మ్యాచ్ ప్రారంభ నిమిషాల్లో ఇంగ్లండ్ దూకుడు ప్రదర్శించినా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. కాగా, ఇరు జట్లకు 12 పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఎవరూ గోల్‌ చేయలేకపోయారు. అంతకుముందు కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్, ఇంగ్లండ్ హాకీ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది.

Leave a Reply