గుజరాత్ ఎన్నికల్లో వరుసగా ఏడోసారి విజయం సాధించిన తర్వాత బీజేపీ వారం రోజుల్లోనే రెండో పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించింది.
పార్లమెంటు ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు బీజేపీ పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కొందరు ఎంపీలు, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఇటీవల భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా ప్రభుత్వంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు చర్చకు డిమాండ్ చేస్తున్నప్పటికీ బీజేపీ అనుమతించడం లేదు. దీంతో పార్లమెంట్ స్తంభించింది. ఇదే క్రమంలో ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో విజయవంతమైన కొద్ది రోజులకె బీజేపీ రెండో పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
ఢిల్లీలో ప్రత్యేక విందు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన సందర్భంగా సీఆర్ పాటిల్ మంగళవారం సాయంత్రం విందు ఏర్పాటు చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. ఢిల్లీ జింఖానా క్లబ్లో జరగనున్న ఈ విందుకు ఎన్డీయే ఎంపీలందరితో పాటు వారి జీవిత భాగస్వాములను ఆహ్వానించారు. ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.