ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకునే వ్యక్తి తగినంత పోషకాలను తీసుకోవాలి. పోషకాలు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. డ్రై ఫ్రూట్స్‌తో పోషకాలకు మంచి మూలం. డ్రై ఫ్రూట్స్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సినవి వాల్నట్స్. వాల్‌నట్స్‌లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ మరియు సెలీనియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా, వాల్నట్లను డ్రై ఫ్రూట్స్‌లో రారాజుగా పిలుస్తారు. వీటిని నానబెట్టి ఉదయాన్నే తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి.
మధుమేహం అదుపులో ఉండాలంటే రెండు వాల్ నట్స్ ను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినాలి. వాల్ నట్స్ కీళ్ల నొప్పులకు, ఎముకలు గట్టిపడటానికి కూడా ఉపయోగపడుతాయి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
కోవిడ్ కాలంలో డ్రైఫ్రూట్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది, కాబట్టి ఎక్కువ మంది వాటిని తినడం ప్రారంభించారు. అందుకే డ్రైఫ్రూట్స్ తినడం అలవాటు లేని కొందరు అలవాటు చేసుకున్నారు. డ్రైఫ్రూట్స్ రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో వ్యక్తిలోని రోగనిరోధక శక్తిని ఇవి పెంచుతాయి. వాల్నట్లు అనేక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి, ఆరోగ్యంగా, ధృడంగా ఉండేందుకు మనం తీసుకునే ఆహారంలో నానబెట్టిన వాల్ నట్స్ ను తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది.
వాల్నట్లు డైటరీ ఫైబర్‌కి మంచి మూలం, ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. మలబద్ధకాన్ని నివారించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. రోజూ వాల్నట్లను తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
మధుమేహ ఉన్న వారు వాల్ నట్స్ తినడం వల్ల చాలా ప్రయోజనం పొందవచ్చు. ప్రతిరోజూ వాల్నట్లను తినేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు
ఎముకలు మరియు దంతాలు దృఢంగా ఉంచడానికి వాల్నట్లు సహాయపడతాయి. వాల్‌నట్స్‌లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది, ఇది ఎముకలను దృఢంగా మార్చడానికి సహాయపడుతుంది.
రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ గింజలలో ఎల్లాగిటానిన్స్ అనే ఒక రకమైన పాలీఫెనాల్ ఉంటుంది.
వాల్నట్లు మీ గుండెకు మేలు చేయడం లో సహాయపడుతుంది, ఎందుకంటే వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు మీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి, ఇది మీ గుండెను రక్షించడంలో సహాయపడుతుంది.