వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర నర్సంపేటకు చేరుకోగానే అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె కాన్వాయ్, ప్రచార రథంపై దాడి చేశారు… దీనితో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి లోటస్ పాండ్ లో వదిలిపెట్టారు . ఆ తరువాతి రోజు లోటస్ పాండ్ నుండి బయటకు వచ్చి ప్రగతి భవన్ వైపు వెళ్తున్న Ys షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో దెబ్బతిన్న కారును నడుపుకుంటూ షర్మిల ప్రగతి భవన్ వైపు వెళ్లబోయారు.
ఈ క్రమంలో పోలీసులు సోమాజిగూడ వద్ద ఆమెను అటుగా పోనియ్యకుండా ఆమె వాహనానికి పోలీసులు వాహనాలను అడ్డుపెట్టారు. దీనితో ఆమె కారు అద్దాలను లాక్ చేసుకుని కారులోనే కూర్చున్నారు .
ఆమెను బయటకు తీసుకురావాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీనితో పోలీసులు ఆమె కారులో ఉండగానే టొయింగ్ వెహికల్ తో SR నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం అక్కడ కూడా హైడ్రామా నడించింది .
పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆమె కారు డోర్ తీయకుండా అలాగే ఉండిపోయింది. దీనితో పోలీసులు కష్టతరం మీద లాఠీ సహాయంతో డోర్ అన్ లాక్ చేశారు. అనంతరం కారులో ఉన్న అందరిని అరెస్ట్ చేశారు. మహిళా పోలీసులు షర్మిలను స్టేషన్ లోపలికి తరలించారు. అనంతరం షర్మిలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే ఈ సంఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఫోన్ చేశారు. .. దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడినట్టు తెలుస్తోంది .
అయితే మోదీ ఏ అంశాలపై షర్మిలతో మాట్లాడారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. అయితే ఇటీవల నర్సంపేటలో షర్మిలపాదయాత్రలో చోటు చేసుకున్న పరిణామాలపై మోదీ ఆరా తీసినట్టు తెలుస్తోంది . . ఈ ఘటనపైనే మోదీ సానుభూతి వ్యక్తం చేశారని … ఈ సందర్బంగా షర్మిల మోదీని కలవాలని చెప్పగా..ఢిల్లీకి రావాలని సూచించినట్టు తెలుస్తుంది.