గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ పర్వం కొనసాగుతోంది. బడా హీరోల పుట్టిన రోజుల సందర్భంగా 4K పేరుతో సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ ,ప్రభాస్ ,బాలయ్య లాంటి హీరోల సినిమాలను వారి పుట్టిన రోజుల సందర్భంగా విడుదల చేశారు. అభిమానుల నుంచి ఈ సినిమాల ప్రదర్శనకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది.కాకపోతే చిన్న డిఫ్రెన్సు ఉంది …ఇది రజినికాంత్ సినిమా కాబట్టి కేవలం కోలీవుడ్ లో మాత్రమే కాకుండా డిసెంబర్ 12న అయన పుట్టినరోజు సందర్భంగా ‘బాబా’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ లింక్ ను రజనీకాంత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. తన మనసుకు నచ్చిన సినిమా త్వరలో రీ రిలీజ్ కాబోతుందని వెల్లడించారు.ఎందుకు తన మనసుకు నచ్చిన సినిమా అంటే .. అప్పట్లో రజినీకాంత్ సినిమా షూటింగ్ అవ్వగానే వెంటనే కొద్దీ రోజులు హిమాలయాలకు వెళ్లి గడిపి వచ్చేవారు …అలా కొద్దీ రోజులు సాధు పుంగవులతో గడపటం మూలంగానేమో దైవ చింతన కాస్త ఎక్కువే అయింది ..అలా అప్పట్లో బాబా సినిమా తీయాలి అనే తలంపుతో త్రీ సంవత్సరాల సమయం తీసుకోని మరీ ఈ సినిమాను రూపొందించారు …
గతంలో సినిమాలను రీ రిలీజ్ చేయాలి అంటే కేవలం ఉన్నది ఉన్నట్లుగానే ప్రదర్శించారు. అయితే, రజనీకాంత్ ‘బాబా’ సినిమా విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు . ఇందులో భాగంగానే కొన్ని అదనపు సీన్లు యాడ్ చేస్తున్నారట. వీటికి కోసం ఇప్పటికే రజనీకాంత్ డబ్బింగ్ కూడా చెప్పారు. తాజాగా ఆయన డబ్బింగ్ చెప్తున్న ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అటు కొన్ని సీన్లు తీసేసినట్లు సమాచారం. మరోవైపు బ్యాగ్రౌండ్ స్కోర్ లో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ ను కూడా సంప్రదించారు అంట మూవీ టీమ్. ఇప్పటికే ఆ పనులన్నీ పూర్తయినట్లు తెలుస్తోంది.రజనీకాంత్ నటించిన ‘బాబా’ మూవీ 2002లో విడుదల అయింది. నరసింహ’ లాంటి సూపర్త హిట్ మూవీ తర్వాత రజనీ మూడేళ్ళు గ్యాప్ ఇచ్చి ఈ సినిమాని చేశారు… సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య విడుదల అయింది… అప్పట్లోనే భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఇది . మనీషా కొయిరాల హీరోయిన్ గా చేసిన ఈ సినిమా 2002 ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీ కాంత్ ఈ సినిమాలో హీరోగానే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, నిర్మాతగా వ్యవహరించారు. సినిమా విడుదల తర్వాత పూర్తి నెగిటివ్ టాక్ రావడంతో డిజాస్టర్ గా మిగిలింది. అయినప్పటికీ ఈ సినిమా రజినికి ఎంతో ఇష్టమైన సినిమా ఇది ..అందుకే ఎంతో మనసుపెట్టి మరీ చేశారు ..అందుకే ఇప్పుడు ఆయన బర్త్డే సందర్బంగా రీ రిలీజ్ కు ఈ సినిమా ను ఎంచుకున్నారు .. కొన్ని మార్పులు ,చేర్పులు తర్వాత మరీ ఈ సినిమా ఇప్పుడు ఎలా ఉండబోతుందో చూడాలి ..బాబా’ సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్ళు పూర్తయింది. మళ్లీ ఇప్పుడు ఆ సినిమాను రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా సరికొత్త మెరుగులద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సినిమా అప్పట్లో ఫ్లాప్ గా నిలిచినప్పటికీ ఇందులో రజనీ డైలాగ్స్, పాటలను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.