Naga Chaitanya Akkineni: వైరల్ అవుతోన్న నాగ చైతన్య, శోభితా దూళిపాళ ఫొటో.. ఇప్పుడైనా నోరు తెరుస్తారా?

అక్కినేని కథానాయకుడు నాగ చైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం తన సినిమాలపై ఫోకస్ పెట్టారు. గత ఏడాది నాగ చైత‌న్య‌, స‌మంత‌కు (Samantha Ruth Prabhu) విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ట్రీ జ‌నాలు ఎంతో ఇష్ట‌ప‌డిన బెస్ట్ క‌పుల్స్‌లో ఒక‌టిగా చెప్పుకున్న చైతు, సామ్ జోడీ ఎందుకు విడిపోయారో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. కొన్నాళ్ల పాటు వీరి విడాకుల‌కు ఇదే కార‌ణాలంటూ కూడా ప‌లు వార్త‌లు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. కానీ వారిద్ద‌రు నోరు విప్ప‌నేలేదు. ఎవ‌రి ప‌ర్స‌న‌ల్‌, ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌ల‌తో బిజీగా మారిపోయారు. అయితే, ఈ మ‌ధ్య నాగ చైత‌న్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) డేటింగ్ చేస్తున్నార‌నే తెగ వైర‌ల్ అయ్యాయి.

అస‌లు నాగ చైత‌న్య‌, శోభితా దూళిపాళ‌కు ఎక్క‌డ లింకు కుదిరిందో తెలియ‌క ఆ స‌మ‌యంలో కొంద‌రు జుట్టు పీక్కున్నారు. మ‌రకొంద‌రైతే చైతు, శోభిత మధ్య రిలేష‌న్ ఉంద‌నే వార్త‌ల్లో నిజం లేద‌ని కూడా అన్నారు. ఆ సమయంలో అయితే నాగ చైతన్య కానీ, శోభిత కానీ వారి రిలేషన్ గురించి నోరు మెదపలేదు. తాజాగాఅయితే వీరిద్ద‌రూ క‌లిసి ఉన్న ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. మరి నిజంగానే వారిద్దరూ కలిసి దిగిన ఫొటోనా లేక ఎడిటింగ్ ఫొటోనా అని తెలియటం లేదు. అయితే కొందరు నెటిజన్స్ మాత్రం చైతు – శోభిత మధ్య ఏదో ఉందంటూ తమకు నచ్చిన రీతిలో రియాక్ట్ అవుతున్నారు. మరిప్పుడైన వీరిద్దరూ ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.

గూఢచారి, మేజర్  చిత్రాల్లో అడివి శేష్‌ (Adivi Sesh) తో కలిసి శోభితా ధూళిపాళ నటించింది. ఆ తర్వాత రీసెంట్‌గా విడుదలైన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) చిత్రంలో జయం రవి సరసన నటించింది. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న కస్టడీ (Custody movie) చిత్రంలో నటిస్తున్నారు. రీసెంట్‌గా చైతన్య బర్త్ డే  సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలైంది. దీంతో పాటు విక్రమ్ కె.కుమార్ (Vikram Kumar) దర్శకత్వంలో రూపొందుతోన్న దూత వెబ్ సిరీస్‌లోనూ చైతన్య నటించారు.