ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా విడుదలై మంచి విజయం సాధిస్తుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ హిట్‌గా నిలిచింది. విడుదలై 50రోజులు దాటిన థియేటర్లలో సక్సెస్‍ఫుల్ గా సత్తా చాటుతుంది.
కాంతారావు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హిట్ అయింది. విడుదలై 50రోజులు దాటిన థియేటర్లలో సక్సెస్‍ఫుల్ గా సత్తా చాటుతుంది. తాజా గా ఈ సినిమా కేజీఎఫ్ 2 రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 400కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కన్నడలో ‘కాంతారా’ సెప్టెంబర్ 30న విడుదలైంది. తర్వాత ఇతర భాషల్లో కూడా ప్రేక్షకుల నుంచి డిమాండ్ రావడంతో డబ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రానికి అన్ని భాషల్లో మంచి ప్రశంసలు అందుకుంటుటంది.
కన్నడలో రూ.168.50 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఆంధ్రా, తెలంగాణల్లో తెలుగు వెర్షన్ నుంచి రూ.60 కోట్లు రాబట్టింది. తమిళనాడులో రూ.12.70 కోట్లు, కేరళలో రూ.19.20 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్‌కి రూ. 96 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. విదేశీ బాక్సాఫీస్ వద్ద రూ.44.50 కోట్లు వసూలు చేసింది. కన్నడ సినిమా ఈ ఘనత సాధించడం నిజంగా అభినందనీయం. ఇప్పటికీ చాలా చోట్ల మంచి ప్రదర్శన కనబరుస్తోంది.ఈ చిత్రంలో రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం అభిమానుల నుంచి చాలా ప్రశంసలు అందుకుంది.ఈ సినిమాలో సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, మానసి సుధీర్ ముఖ్య పాత్రలు పోషించారు.
త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ రానుందని తెలుస్తోంది. అయితే ఇదే విషయం నెట్టింట వైరలవుతుండగా.. ఈ చిత్రానికి సీక్వెల్ గురించి ఇంకా ఆలోచించడం లేదని, రెండు నెలలు విరామం తీసుకునే వరకు దాని గురించి ఆలోచించడం లేదని రిషబ్ శెట్టి అన్నారు.
‘KANTARA’ CROSSES ₹ 400 CR WORLDWIDE… #Kantara territory-wise breakup… Note: GROSS BOC…
⭐️ #Karnataka: ₹ 168.50 cr
⭐️ #Andhra / #Telangana: ₹ 60 cr
⭐️ #TamilNadu: ₹ 12.70 cr
⭐️ #Kerala: ₹ 19.20 cr
⭐️ #Overseas: ₹ 44.50 cr
⭐️ #NorthIndia: ₹ 96 cr
⭐️ Total: ₹ 400.90 cr pic.twitter.com/CmBQbLrZvf— taran adarsh (@taran_adarsh) November 22, 2022