BJP ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీనే గెలవాలి.
BJP గుజరాత్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీనే గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నాకోసం ఇది చేయండని కోరారు. పోలింగ్ రోజున పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి.. మునుపటి పోలింగ్ రికార్డులను తిరగరాయాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్లో పర్యటిస్తోన్న ఆయన.. అక్కడి ప్రముఖ సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు
2.మంత్రి మల్లారెడ్డిని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు (వీడియో)
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ లో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. కాగా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు మంత్రి మల్లారెడ్డి జవహర్ నగర్ పాదయాత్ర చేపట్టారు. మంత్రి పర్యటిస్తుండగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు అక్కడికి వచ్చి హామీలు నెరవేర్చలేదని మంత్రిని నిలదీశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.
3.ఉక్రెయిన్ కి రిషి సునాక్ మద్దతు:-
బ్రిటన్ పగ్గాలు చేపట్టిన తర్వాత రిషి సునాక్ తొలిసారిగా ఉక్రెయిన్‌లో పర్యటించారు. రష్యా చేస్తున్న దురాక్రమణ యుద్ధంలో ఉక్రెయిన్‌కి బ్రిటన్ అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని సునాక్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ ప్రజలకు కావాల్సిన ఆహారం, ఔషధాలు, అందుబాటులో ఉండేలా బ్రిటన్ మానవతా సహాయాన్ని అందించడం కొనసాగిస్తుందని తెలిపారు. రష్యా చేస్తున్న యుద్ధాన్ని నిరంకుశత్వానికి పరాకాష్టగా అభివర్ణించారు.
4.రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం.. పవన్‌కు ఆ సత్తా ఉంది: చిరు
AP: రాజకీయాల్లో సెన్సిటివ్ గా ఉండకూడదు. కటువుగా ఉండాలి.. అక్కడ రాణించడం కష్టం అని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. అలా ఉండటం తన వల్ల కాలేదన్నారు. పవన్ కళ్యాణ్ అసాధ్యుడని.. ఏమైనా అంటాడు, అనిపించుకుంటాడని చెప్పారు. మీ అందరి అండతో ఏదో ఒక రోజు అత్యున్నత స్థాయిలో చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన నర్సాపురం వైఎన్ కళాశాల విద్యార్థుల గెట్ టు గెదర్ కార్యక్రమంలో మెగాస్టార్ పాల్గొన్నారు.
5.ఎంత చేసినా నా వల్ల కాలేదు’…
వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అనంతగిరి సమీపంలోని ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టగా ఒకరు మృతి చెందగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆర్టీసీ బస్సును అధికారులు జేసీబీ సహాయంతో పక్కకు తొలగించారు.వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టిన విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్‌తో మాట్లాడారు. డ్రైవర్ మాట్లాడుతూ.. బ్రేక్ ఫెయిల్ అయ్యిందని, బస్సును ఆపేందుకు ఎంత ట్రై చేసినా నా వల్ల కాలేదని, మధ్యలో ఓ ఆటోను కూడా తప్పించానన్నారు. కాగా డిపోలో నుండి బస్సును తీసేటప్పుడు బ్రేక్ చెక్ చేయలేదా అని స్థానికులు అతన్ని ప్రశ్నించారు.
6.ట్రాక్టర్‌పై గర్భిణిని ఆసుపత్రికి తీసుకొచ్చారు!
సోషల్ మీడియాలో ఓ గర్భిణిని ట్రాక్టర్ ఉంచి ఆసుపత్రికి తీసుకొచ్చిన వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కొన్ని ప్రాంతాల్లో అంబులెన్సులు అందుబాటులో లేకపోవడంతో.. గర్భిణిని ప్రమాదకరంగా ట్రాక్టర్‌పై ఉంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను నెటిజన్లు పోస్ట్ చేస్తూ.. ‘డబుల్ ఇంజన్ పాలన’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
7.నాగశౌర్య ఓ ఇంటి వాడు అయ్యాడు.
కుటుంబ సభ్యుల మధ్య నాగశౌర్య వివాహం నటుడు నాగశౌర్య ఓ ఇంటి వాడు అయ్యాడు. బెంగళూరుకు చెందిన అనూషాశెట్టి మెడలో మూడు ముళ్లు వేశారు. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.
8.బ్లాక్ సూట్ లో జక్కన్న:-
స్టార్ డైరెక్టర్ రాజమౌళి అరుదైన ఆహ్వానం అందుకున్నాడు. లాస్ ఏంజెల్స్‌లో 13వ వార్షిక గవర్నర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నాడు. జక్కన్న స్టైలిష్ బ్లాక్ సూట్లో ఈవెంట్‌కు హాజరయ్యాడు. రాజమౌళితో పాటు కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ కూడా ఉన్నాడు. ఈ ఫొటోలను కార్తికేయ ట్విటర్ వేదికగా షేర్ చేశాడు. ఈ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.
9.సూర్యది వీడియో గేమ్ ఇన్నింగ్స్: కోహ్లి
NZపై సెంచరీ చేసిన సూర్య కుమార్ యాదవ్‌పై కింగ్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ఇదో అద్భుతమైన ఇన్నింగ్స్ అని కొనియాడాడు. ‘ప్రపంచ క్రికెట్ అతడెందుకు బెస్ట్ ప్లేయరో మరోసారి రుజువైంది. లైవ్ చూడలేదు కానీ ఇది మరో వీడియో గేమ్ ఇన్నింగ్స్ అని నమ్ముతున్నా’ అని చెప్పాడు. కాగా, సూర్య 51 బంతుల్లోనే 7 సిక్సర్లు, 11 ఫోర్లతో 111* పరుగులు చేశాడు.