TRS ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన మోదీ
ప్రధాని మోదీ తెలంగాణ సర్కారుపై గతంలో ఎప్పుడూ లేనంతగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతుందంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కొంతమంది తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. వారికి కచ్చితంగా బుద్ధి చెబుతామని.. గత 8 ఏళ్లుగా అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం కూరుకుపోయిందని, టీఆర్ఎస్ అధికారాన్ని కూకటి వేళ్లతో పీకేయడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు.పీఎం మోదీ బేగంపేటలో చేసిన ప్రసంగం ఆద్యంతం రాజకీయాల చుట్టే తిరిగింది.
సాధారణంగా అభివృద్ధి గురించి మాట్లాడే మోదీ ఎక్కువ సేపు రాజకీయాలనే ప్రస్తావించారు. ముఖ్యంగా కేసీఆర్ పేరు తీయకుండానే ఆయనపై పరోక్షంగా విమర్శలు చేశారు. అయితే మోదీ ప్రసంగం.. మునుగోడు ఓటమితో నిరుత్సాహంలో ఉన్న పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకేనని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.తెలంగాణకు చేరుకున్న ప్రధాని మోదీ రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. వాటిలో రూ.6338 కోట్లతో పునరుద్ధరించిన RFCL, రూ.2300 కోట్లతో మెదక్ -సిద్ధిపేట- ఎల్కతుర్తి జాతీయ రహాదారి విస్తరణ, బోధన్-బాసర-బైంసా రోడ్డు విస్తరణ, సిరోంచ-మహదేవపూర్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసారు. వీటితో పాటు భద్రాచలం రోడ్- సత్తుపల్లి రైల్వే స్టేషను జాతికి అంకితం చేయనున్నారు.
2.రైతులకు ఉచితంగా ఎరువులు.. గుర్తుందాKCR అన్న ఈటల.
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ట్విటర్ వేదికగా ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ 2017 ఏప్రిల్ 13న రైతులతో దేశమే ఆగమవుతుందని చెబుతూ.. ఉచితంగా ఎరువులు అందజేస్తామని ప్రకటించిన వీడియోను షేర్ చేశారు. ‘మీరు ఇస్తా అన్న ఉచిత ఎరువుల ప్రసంగం గుర్తుందా ముఖ్యమంత్రి గారు. రైతుకు మేలు చేసే ఎరువుల కర్మాగారాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు’ అని ప్రశ్నించారు.
3. ‘అలా చేసుంటే Tకాంగ్రెస్ పరిస్థితి వేరేలా ఉండేది’
బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఓటమి తర్వాత మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘మాలో ఒకరిని ప్రెసిడెంట్ చేసుంటే Tకాంగ్రెస్ ఈ పరిస్థితిలో ఉండేది కాదు. అన్న, తమ్ముడు అని చూస్తే ఈ పోరాటం సాగదు. ఎవ్వరికీ భయపడం. చంద్రబాబు సంకలో పడుకున్నోడిని తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేసి.. పనిచేయమంటే వాడి చరిత్ర చూస్తేనేమో జైలుకెళ్లిన, బ్లాక్ మెయిల్ చరిత్ర’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.
4. పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదుAP: –
పవన్ కళ్యాణ్ వల్ల తనకు బైక్ ప్రమాదం జరిగిందని తెనాలికి చెందిన శివ అనే వ్యక్తి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా జనసేనానిపై IPC 336, రెడ్ విత్ 177MV చట్టం కింద కేసు నమోదు చేశారు. నవంబర్ 5న ఇప్పటం రోడ్డుపై వెళ్తున్న టైంలో పవన్ కాన్వాయ్ వేగంగా వచ్చిందని, ఓ కారుపై పవన్ కూర్చున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పవన్ నిర్లక్ష్యం కారణంగా తాను బైక్ నుంచి పడ్డానని తెలిపాడు.
5. సుకేశ్‌ను బీజేపీ ప్రెసిడెంట్ చేయండి: కేజీవాల్ :-
మనీలాండరింగ్ కేసు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌కు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించాలన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్. ‘ఈ మధ్య మోదీ రోడ్ షోలకు ఆదరణ లేదు. ఆ స్థానంలో సుకేశ్‌ను స్టార్ క్యాంపైనర్‌గా చేస్తే అందరినీ ఎలా మోసం చేస్తాడో చెప్పి జనాలను ఆకర్షిస్తాడు. బీజేపీలో చేరేందుకు సుకేశ్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని రెడీగా ఉన్నాడు’ అని అన్నారు.
6.నా ఎలిమినేషన్ కి నాగార్జునే కారణం
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక గీతూ రాయల్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె హౌస్‌లో తన అనుభవాలు, ఎలిమినేషన్ కి కారణాలు వెల్లడిస్తున్నారు. ఎలిమినేషన్ షాక్ నుండి ఇంకా బయటపడని గీతూ అది తలచుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తన గేమ్ గాడి తప్పడానికి బిగ్ బాస్ తో పాటు హోస్ట్ నాగార్జున పరోక్షంగా కారణమయ్యారని గీతూ ఆవేదన చెందుతున్నారు. హౌస్‌లో నేను ఏం చేసినా బిగ్ బాస్ ఏమీ అనేవాడు కాదు. పైగా నా గేమ్ ని బిగ్ బాస్ పొగుడుతూ ఉండేవాడు. ప్రచారం అవుతున్నట్లు బిగ్ బాస్ దత్తపుత్రికను అని నాకు కూడా అనిపించింది.హోస్ట్ నాగార్జున సైతం నా గేమ్ ని ఎంతగానో పొగిడారు. వీకెండ్ ఎపిసోడ్ గంట గంటన్న మాత్రమే చూపిస్తారు.
కానీ దాదాపు నాలుగు గంటలు అది జరుగుతుంది. ఎలిమినేషన్ రోజు కూడా నాగార్జున నాపై ప్రశంసలు కురిపించారు. ఈ హౌస్‌లో నటించని, జెన్యూన్ ప్లేయర్ ఒక్క గీతూనే. ఆమె మిగతా కంటెస్టెంట్స్ నుండి ఫైర్ బయటకు తీసింది అన్నారు. అది ఎపిసోడ్లో చూపించలేదు. హౌస్ ని పాలించకుండానే బయటకు వెళ్ళిపోతున్నానని బాధపడ్డాను. దానికి నాగార్జున 9 వారాలు హౌస్ ని ఏలింది నువ్వే అని చెప్పారని గీతూ వెల్లడించారు.
7. ఇదే రాజమౌళి కాపీ యూనివర్స్: KRK :-
బాలీవుడ్ క్రిటిక్ అని పేర్కొంటూ తరచూ వివాదాస్పద ట్వీట్లు చేసే కమల్ ఆర్ ఖాన్ మరోసారి టాలీవుడ్‌పై తన అక్కసు వెళ్లగక్కాడు. బాహుబలి సినిమా మొత్తం కాపీనే అంటూ ఆ సినిమాలోని పలు సన్నివేశాలను 35 హాలీవుడ్ చిత్రాల సీన్స్‌తో పోలుస్తూ ఎడిట్ చేసిన వీడియో షేర్ చేశాడు. ‘ఇది జీనియస్ అనబడే డైరెక్టర్ రాజమౌళి కాపీ యూనివర్స్. ప్రతీ సన్నివేశాన్ని ఫారిన్ సినిమాల నుంచి కాపీ కొడతాడు’ అని పేర్కొన్నాడు.
8.ఇండియాకు ప్రైజ్ మనీ ఎంతంటే?:-
T20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా సెమీఫైనల్ నుంచి నిష్క్రమించిన రోహిత్ సేనకు ఎంత ప్రైజ్ మనీ రానుందో తెలుసా..? సూపర్-12లో ప్రతి విజయానికి 40వేల డాలర్లు, సెమీ-ఫైనలిస్ట్కి చేరినందుకు మరో 400,000 డాలర్లు అందుకుంటుంది. అంటే.. మొత్తం 560,000డాలర్లు టీమ్ ఇండియా అందుకోనుంది. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.4.51కోట్లు. ఫైనల్ చేరిన ఇంగ్లాండ్, పాక్ జట్లలో విజేత $1,600,000, రన్నరప్ $800,000 అందుకోనున్నాయి.
9.ఐసీసీ కీలక పదవిలోకి జైషా :-
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో బీసీసీఐ కార్యదర్శి జైషా కీలక బాధ్యతలు చేపట్టినట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. శనివారం జరిగిన ఎన్నికల్లో జైషాను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపాయి. మరోవైపు ఐసీసీ చీఫ్ గా ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న గ్రెగ్ బార్క్లే క్లే మళ్లీ బాధ్యతలు అప్పగించారు బోర్డు సభ్యులు.