హైదరాబాద్‌లో మరో సెన్సేషన్ కిడ్నాప్ కేసు వెలుగుచూసింది. అంబర్పేట్ డీడీ కాలనీలో అక్టోబర్ 29న మంత్రిశ్యామ్ అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేశారు. రూ.1.5 కోట్ల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు కేసు ఛేదించి 10 మందిని అరెస్ట్ చేశారు.
పరిశోధనలో షాక్ ఇచ్చే వివరాలు బయటపడ్డాయి. బాధితుడు మంత్రిశ్యామ్ మొదటి భార్య మాధవీలతే ఈ కిడ్నాప్‌కు మూల కారణమని అధికారులు వెల్లడించారు. అమెరికాలో ఉంటూ ఆమె మొత్తం ప్రణాళికను రూపొందించి, సహచరుల ద్వారా అమలు చేయించిందని తేలింది.
మాధవీలత ఆదేశాల మేరకు సరిత అనే మహిళ మంత్రిశ్యామ్ నివసించే అపార్ట్మెంట్లో ఉంటూ అతని కదలికలను గమనించింది. అనంతరం రెంట్ కార్లలో వచ్చిన దుండగులు మంత్రిశ్యామ్ను కిడ్నాప్ చేసి చర్లపల్లి ప్రాంతంలోని రెండు ప్రదేశాల్లో ఉంచి డబ్బులు అడిగారు. అయితే, తెలివిగా కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న మంత్రిశ్యామ్ పోలీసులు చేరుకున్నాడు.
సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ ట్రాకింగ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. మొత్తం మూడు కార్లు, రెండు బైకులు, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మాధవీలతపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు
