మానవత్వం చాటిన పోలీస్

ప్రపంచంలో ప్రతి రోజు అనేక సంఘటనలు జరుగుతుంటాయి. కానీ కొన్ని సంఘటనలు మన హృదయాలను తాకుతూ, మానవత్వం ఇంకా కొనసాగుతున్నదని గుర్తు చేస్తాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో అందులో ఒకటి.

రైలులో ఒక టీ అమ్ముకునే అతను గంటల తరబడి టీ అమ్మి అలసి, సీటుపై నిద్రపోయాడు. అదే సమయంలో ఖాకీ యూనిఫాం ధరించిన ఒక పోలీస్ అతన్ని గమనించి, అతన్ని అవగాహనతో సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.

పోలీసు నిశ్శబ్దంగా, టీ డబ్బా తీసుకోని ప్రయాణికులకు టీ అందించడం ప్రారంభించాడు. నిద్రలేచిన టీ అమ్మే ఆతను తన టీ డబ్బా కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. అప్పుడు పోలీస్ తిరిగి వచ్చి, అతన్ని హృదయపూర్వకంగా కౌగిలించి, అమ్మిన డబ్బులను అతనికి అందజేశాడు.

ఈ 43 సెకన్ల వీడియో సామాజిక మాధ్యమాలలో హృదయాలను తాకింది. చిన్న సహాయం కూడా జీవితాలను మార్చగలదు, కరుణ, జాలి, మానవత్వం వంటి గుణాలు ఇంకా సజీవంగా ఉన్నాయి అని, ఈ వీడియో తో అర్ధం అవుతుంది.

Leave a Reply