జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఖరారు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. ఈ సారి బరిలో కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన ద్వారా ప్రకటించారు.

ఇటీవల ఎన్నికల కమిషన్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 13న నోటిఫికేషన్ వెలువడగా, నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. బీఆర్‌ఎస్ ఇప్పటికే మాగంటి సునీతను తన అభ్యర్థిగా ప్రకటించడంతో, కాంగ్రెస్ కూడా వేగంగా తన అభ్యర్థి ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది.

గత రెండు రోజులుగా ఇంచార్జ్ మంత్రులు, నియోజకవర్గ నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన కాంగ్రెస్ హైకమాండ్ చివరకు స్థానిక బీసీ నేత నవీన్ యాదవ్ పేరుపై అంగీకారం తెలిపింది. జూబ్లీహిల్స్ టికెట్ కోసం అజారుద్దీన్, బొంతు రామ్మోహన్, సి.ఎన్.రెడ్డి, విజయలక్ష్మి వంటి పలువురు నేతలు పోటీ పడ్డారు. అయితే స్థానిక బీసీ సమాజానికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో పార్టీ నవీన్ యాదవ్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

ఈ నిర్ణయంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయ హీటు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply