మెగా ఫ్యామిలీ నుండి 3వ తరం వారసుడిగా వాయువ్ తేజ్ కొణిదెల

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ కొణిదెల మరియు లావణ్య త్రిపాఠి తమ కొడుకుకు “వాయువ్ తేజ్ కొణిదెల” అనే పేరు పెట్టారు. అక్టోబర్ 2న, విజయదశమి పర్వదినం సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.

పేరులో “వాయువ్” అనగా గాలి లేదా పవన్, ఇది హనుమాన్ దేవుని శక్తి, వేగం మరియు ఆధ్యాత్మికతను సూచిస్తుంది. “తేజ్” అంటే కాంతి లేదా శక్తి, ఇది వారి కొడుకుకు వెలుగును, ధైర్యాన్ని మరియు సానుకూల శక్తిని ఇవ్వాలని ఆ పేరు ని పెట్టినట్లు తెలుస్తుంది.

వారు ఈ పేరును సాంప్రదాయ నామకరణ వేడుక ద్వారా ప్రకటించారు. లావణ్య సాంప్రదాయ చీరలో, వరుణ్ తేజ్ ఐవరీ రంగు కుర్తాలో కనిపించారు. వీరు తమ కొడుకుతో కలిసి ఆనందంగా ఫోటోలు దిగారు, వాటిని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా చిరంజీవి మరియు రామ్ చరణ్, ఈ శుభ సందర్భంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ 3వ తరం వారసుడిగా మరొక హీరో రెడీ అయ్యాడు అనే వార్తతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply