తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలు, దశలవారీ వివరాలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ రాణికుముదిని ప్రకటించారు. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 9లోపు మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాలు, 565 మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.

అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని అధికారిణి స్పష్టం చేశారు.

ఐదు దశల్లో ఎన్నికలు

మొత్తం ఐదు దశల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుందని ఎస్‌ఈసీ వివరించారు.

అక్టోబర్ 23న తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్

అక్టోబర్ 27న రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్

అక్టోబర్ 31న తొలి విడత గ్రామపంచాయతీ పోలింగ్

నవంబర్ 4న రెండో విడత గ్రామపంచాయతీ పోలింగ్

నవంబర్ 8న మూడో విడత గ్రామపంచాయతీ పోలింగ్

గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు అదేరోజు పూర్తిచేసి ఫలితాలు ప్రకటిస్తామని ఎస్‌ఈసీ తెలిపారు. కాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరగనుంది.

కీలక వివరాలు

31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు

రెండు విడతల్లో 5,749 ఎంపీటీసీ, 656 జడ్పీటీసీ ఎన్నికలు

12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో పోలింగ్

Leave a Reply