ఆసియాకప్ విజయం.. టీమ్ ఇండియాకు భారీ నజరానా ప్రకటించిన BCCI..!

ఆసియాకప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియా కోసం BCCI భారీ నజరానాను ప్రకటించింది. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ కలిపి మొత్తం రూ.21 కోట్ల ప్రైజ్‌మనీ అందించనుందని తెలిపింది. పాకిస్తాన్‌ను ఓడించి భారత్ తొమ్మిదోసారి ఆసియాకప్ టైటిల్‌ను గెలుచుకున్నందుకు ఈ బహుమతిని ఇచ్చారు.

BCCI ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో జట్టు ఫోటోను పోస్ట్ చేస్తూ, “3 షాక్‌లు.. 0 స్పందన. ఆసియా కప్ ఛాంపియన్ సందేశం అందిరికి. జట్టు, సహాయక సిబ్బందికి రూ.21 కోట్ల ప్రైజ్ మనీ” అని రాసింది. అలాగే ఈ ఆసియాకప్‌లో భారత్ పాకిస్తాన్‌ను మూడుసార్లు ఓడించిందని కూడా గుర్తు చేసింది.

ఈ టోర్నీలో భారత్ పాకిస్తాన్‌ను వరుసగా మూడోసారి ఓడించి, ఫైనల్లో అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అసియా కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఫైనల్‌లో విజయం తర్వాత దేశవ్యాప్తంగా ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ లీగ్‌లో మొదట, ఆపై సూపర్ ఫోర్‌లో పాక్ ను భారత్ చిత్తుగా ఓడించింది. ఫైనల్‌లో కూడా వారిని ఓడించి హ్యాట్రిక్ విజయం సాధించింది.

విజయానికి 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తొలి ఐదు ఓవర్లలో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఆరంభం కాస్త పేలవంగా ఉన్నప్పటికీ, తిలక్ వర్మ 53 బంతుల్లో 69 నాటౌట్ పరుగులు చేసి జట్టుకు విజయం తీసుకొచ్చాడు. సంజు సామ్సన్ (24) మరియు శివమ్ దుబే (33; 21 బంతుల్లో) కూడా మద్దతుగా నిలిచారు. ఇక కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి పాకిస్తాన్‌ను ఆలౌట్‌ చేసి, 19.1 ఓవర్లలో 146 పరుగులకే కట్టడి చేశారు.

Leave a Reply